హర్బర్ ఘటన స్థలాన్ని పరిశీలించిన వైవి సుబ్బారెడ్డి
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ ఫిషింగ్ హార్బర్లో ప్రమాద ఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద సమాచా రం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని.. ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. పక్కనే డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నా.. ప్రభుత్వ చర్యల వల్ల పెద్ద విపత్తు కాపాడగలిగామని చెప్పుకొచ్చారు. ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా సీఎం ఉదారంగా ఆలోచించి సహాయానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచిచ్చారన్నారు. గత ప్రభుత్వ హామీలు పూర్తి కాకపోవడంతో బోటు ఓనరలో అపోహలున్నాయని ఆయన అన్నారు.తమ ప్రభుత్వం భరోసా ఇచ్చిందంటే.. వాటిని పూర్తి చేసి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. పూర్తిగా నష్టపోయిన బోట్లకు 80 శాతం పరిహారం అంద జేస్తామని ప్రకటించారు. బోటు కలాసిల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పోర్టు అధికారులతో మాట్లాడి.. తక్షణమే మునిగిన బోట్లను తీయించి కార్యకలాపాలు కొనసాగేలా చూస్తామ న్నారు.

Tags: YV Subbareddy inspected the Harbar incident site
