వైయస్ జగన్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం

– అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళలకు చేయూత వర్తింపు
– మండల వ్యాప్తంగా పాలాభిషేకం నిర్వహించిన మహిళలు

 

 

తుగ్గలి ముచ్చట్లు :

 

తుగ్గలి మండల వ్యాప్తంగా వైయస్సార్ వైయస్సార్ చేయూత పథకానికి అర్హత కలిగిన ఎస్సీ,ఎస్టీ,బిసి మరియు మైనార్టీ మహిళలు తమ పరిధిలోని సచివాలయాల వద్ద వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత వైఎస్సార్ చేయూత కొరకు 23 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 18,750 చొప్పున 4,339 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మహిళలు సంతోషంతో అధికారుల సమక్షంలో పాలాభిషేకం నిర్వహించారు. మంగళవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి లోని స్త్రీ శక్తి భవనం నందు లబ్ధిదారులు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా తుగ్గలి మండల పరిధిలోని ఎర్రగుడి గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి,గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జిట్టా నాగేష్, వైఎస్ఆర్ సీపీ జెడ్పిటిసి అభ్యర్థి పులికొండ నాయక్, సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.

 

 

 

 

తుగ్గలి మండల వ్యాప్తంగా రెండవ విడత వైఎస్ఆర్ చేయూతకు 3198 మహిళలు దరఖాస్తు చేసుకోగా 3149 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని అధికారులు తెలియజేశారు.తుగ్గలి గ్రామం నందు మొత్తం 278 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల కొరకు అందించే చేయూత మొత్తాన్ని వారి అభ్యున్నతి కొరకు ఉపయోగించుకోవాలని తెలియజేశారు.ప్రభుత్వం అందించే చేయూత సహాయం ద్వారా అక్కాచెల్లెమ్మలను భవితలు మంచిగా రూపుదిద్దుకోవాలని అధికారులు తెలియజేశారు.తుగ్గలి మండలం వైస్సార్ క్రాంతి పథకం ఆఫీసు నందు వైఎస్ఆర్ చేయూత 2వ విడుత లైవ్ కార్యక్రమంకు అధికారులు లబ్ధిదారులు హాజరై సీఎం సందేశాన్ని విన్నారు. ఈ కార్యక్రమంలో  ఏపీఎం రామాంజనేయులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పులిశేఖర్, సీ.సీ లు,చేయూత లబ్దిపొందిన మహిళలు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags: Yves Picard is richly anointed to paint

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *