త్వరలో జీరో బేస్డ్ టైం టేబుల్

Date:02/12/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

జీరో బేస్డ్ టైంటేబుల్‌ను తీసుకురానున్నట్టు రైల్వే బోర్డ్ ఛైర్మన్-సీఈవో వీకే యాదవ్ తెలిపారు. దీని వల్ల దూర ప్రాంతాల రైలు ప్రయాణ సమయం అరగంట నుంచి ఆరు గంటల వరకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తర్వాత దీనిని అమలు చేస్తామని అన్నారు. రైళ్లకు సగటున అర గంట నుంచి ఆరు గంటల వరకు సమయం ఆదా అవుతుందని వివరించారు. రైళ్లను రద్దు చేయడం, నిలిపివేయమని కేవలం హేతుబద్ధీకరిస్తామని వీకే యాదవ్ అన్నారు.‘ఏయే రైళ్లలో, ఏయే హాల్టుల్లో మార్పులు చేయాలో నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నాం. ప్రస్తుతం 908 రైళ్లు నడుస్తుండగా వాటిలో 460 మాత్రమే వంద శాతం నిండుతున్నాయి’అని యాదవ్‌ చెప్పారు. తక్కువ డిమాండ్ ఉన్న రైళ్ల ఆక్యుపెన్సీ పెంచడం.. అధిక డిమాండ్ ఉన్న రైళ్లలో వెయిట్‌లిస్టింగ్‌ను తగ్గించడం దీని ఆలోచన.. టైమ్‌టేబుల్ అమల్లోకి వచ్చిన తర్వాత సుదూర రైళ్ల ప్రయాణ సమయం సగటున అరగంట నుంచి ఆరు గంటల వరకు తగ్గుతుంది.. ఈ టైమ్‌టేబుల్ కింద రైళ్ల వేగం కూడా పెరుగుతుంది’ అని అన్నారు.కరోనా వైరస్ నేపథ్యంలో 50 శాతం రైళ్లను మాత్రమే నడుపుతున్నామని తెలిపారు.

 

 

ఇవన్నీ ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్ సర్వీసులేనని పేర్కొన్నారు. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో 20 ప్రత్యేక క్లోన్ రైళ్లను నడుపుతున్నట్టు వివరించారు. అక్టోబరు 20 నుంచి నవంబరు 30 వరకు పండగ సీజన్‌లో 566 ప్రత్యేక రైళ్లు నడిపామని చెప్పారు. జులైలో కోల్‌కతా మెట్రో 238 సర్వీసులు, నవంబరులో 843 సబర్బన్ సర్వీసులు ప్రారంభమయ్యాయని అన్నారు.ప్రస్తుతం 2,773 ముంబయి సబర్బన్ సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. ‘మొత్తం 908 రైళ్లు నడుపుతుండగా వాటిలో 460 రైళ్లు 100 శాతం నిండుతున్నాయి.. 400 రైళ్లో 50 నుంచి 100 శాతం, మరో 32 రైళ్లు 50 శాతం, మిగతా 16 రైళ్లు 30 శాతం కంటే తక్కువ నిండుతున్నాయి’అని చెప్పారు.సరుకు రవాణా విషయానికి వస్తే ఈ నవంబరులో 109.68 మిలియన్ టన్నుల జరగ్గా.. గతేడాది ఇది 100.96 మిలియన్ టన్నులుగా ఉందన్నారు. గతేడాది సరుకు రవాణా ద్వారా రైల్వే రూ.10207.87 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.10,657.66 కోట్లు వచ్చింది. మొత్తంగా రూ.449.79 కోట్ల అదనంగా వచ్చిందన్నారు.

అనంత రేసులో జొన్నలగడ్డ పద్మావతి

Tags; Zero Based Time Table Coming Soon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *