అనంతపురము ముచ్చట్లు:
ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా విద్యార్థులకు దేశభక్తి పెంపొందించడానికి వారికి వివిధ పోటీలను నిర్వహించడం జరిగింది, ఇందులో గెలుపొందిన విద్యార్థులకు మంగళవారం సాయంత్రం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గారి క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ చేతుల మీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ” ప్రతి విద్యార్థిని, విద్యార్థులలో దేశభక్తిని విద్యార్థి దశ నుండే పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. చదువుతోపాటు సాంస్కృతిక, సమాజ సేవ, క్రీడా పోటీలలో పాల్గొనాలని మరియు భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల జీవిత చరిత్రను నేటి విద్యార్థులు తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు, అలాగే నేటి సమాజంలో విద్యార్థులు సామాజిక మధ్యమాలకు బానిసలుగా మారి దేశం కోసం ప్రాణత్యాగలు చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులను మర్చిపోతున్నారు, కాబట్టి ప్రతి ఒక్క విద్యాసంస్థలలో స్వాతంత్ర సమరయోధుల గురించి, అలాగే వారు స్వాతంత్రం కోసం చేసిన పోరాటాల గురించి విద్యార్థులకు తెలియచెప్పాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సార్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి. నందిత, సభ్యులు ఎస్ చాందిని, ఈరమ్మ, ప్రసిల్లా, ఎస్ రాజా, ధోని, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags;ZP Chairman Boyagirizamma should develop aspirations for independence from the student stag