వినికిడి యంత్రాన్ని అందజేసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు
మంథని ముచ్చట్లు :
రామగిరి మండలం కల్వచెర్ల గ్రామానికి చెందిన భనాక లక్ష్మి వినికిడి లోపంతో బాధపడుతూ పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ను సంప్రదించగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా వినికిడి యంత్రాన్ని మంజూరు చేయించారు. మంగళవారం మంథని పట్టణంలోని వారి నివాసమైన రాజగృహలో మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ లు భనాక లక్ష్మి కి వినికిడి యంత్రాన్ని అందజేశారు. మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వినికిడి యంత్రాన్ని లక్ష్మి చెవికి స్వయంగా అమర్చి ఆమెతో మాట్లాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల పరిషత్ చైర్మన్ ఆరెల్లి దేవక్క, నాయకులు తగరం శంకర్ లాల్, ఆరెల్లి కొమురయ్య గౌడ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Tags; ZP Chairman Putta Madhu who presented the hearing aid

