Natyam ad

మృత్యుంజయేశ్వరస్వామి సేవలో జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు

– భక్తిశ్రధ్దలతో ప్రత్యేక పూజలు
– ఎంపీడీఓ కాంప్లెక్స్ నూతనభవనం పరిశీలన
-ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
 
చౌడేపల్లె ముచ్చట్లు:
 
మండలకేంద్రంలోని బజారు వీధిలో వెలసిన శ్రీ అభీష్టధ మృత్యుంజయేశ్వరస్వామి ను జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు కుటుంబసమేతంగా శనివారం దర్శించుకొన్నారు. వీరిని ఆలయ అర్చకులు రాజశేఖర ధీక్షితుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక అర్చనలు,అభిషేకపూజలు చేశారు.స్వామివారి లింగాన్ని ప్రత్యేకపూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ దామోదరరాజు, బోయకొండ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ,సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, తదితరులున్నారు.
భవననిర్మాణ ప్రారంభోత్సవంపై సమీక్ష…… రూ:3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంపీడీ ఓ కాంప్లెక్స్ నిర్మాణపనులను జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు పరిశీలించారు.మంత్రి పెద్దిరెడ్డి చే ఈ భవనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యాలయం ముందుభాగంలో పార్కు తరహాలో అభివృద్దిచేసి ఆకర్షణీయంగా పూలవెహోక్కలు ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మాణ పనులు నిర్ణయించిన గడువు కు ముందే పనులు నాణ్యతగా పూర్తిచేయడం అభినందనీయమని కాంట్రాక్టర్‌ దామోదరరాజును ప్రశంసించారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: ZP Chairman Srinivasan in the service of Mrityunjayeswaraswamy