Natyam ad

నేడు జెడ్పి సర్వసభ్య సమావేశం, జిల్లా స్థాయి సమీక్ష

-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప ముచ్చట్లు:


ఈ నెల 21న జరిగే జెడ్పి సర్వసభ్య సమావేశం, జిల్లాస్థాయి కమిటీ (డీ.ఆర్. సి.) సమీక్షా సమావేశాలకు.. అన్ని శాఖల జిల్లా అధికారులు.. ప్రగతి నివేధికలతో పాటు అభివృద్ధి  ప్రతిపాదనల సమగ్ర సమాచారంతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 21 (శుక్రవారం) ఉదయం 9.30 లకు జెడ్పి సర్వసభ్య సమావేశం జరుగుతుందని, జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు హాజరవుతా రన్నారు.అదే రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు.. కలెక్టరేట్ లోని స్పందన హాలులో జరిగే.. జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశంకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు.. ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారన్నారు.  కావున జెడ్పి, డి.ఆర్.సి. అధికారులు,  సభ్యులందరూ.. జిల్లాలో అభివృద్ధి ప్రగతి నివేధికలతో పాటు.. అభివృద్ధి చేయాల్సిన అంశాల ప్రతిపాదనలకు సంబంధించి సమగ్ర సమాచారంతో  హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు

 

Post Midle

Tags: ZP general meeting, district level review today

Post Midle

Leave A Reply

Your email address will not be published.