-బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో అక్రమ వసూళ్లు… పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
-విద్యాశాఖ అధికారుల మౌనంపై అనుమానాలు
-ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు 10,000 రూపాయలు వసూళ్లు
కారంపూడి ముచ్చట్లు:
కారంపూడి బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు దర్జాగా ఓ ఉపాధ్యాయుడు భారీ వసూళ్ళకి పాల్పదుతున్నాడు. పరీక్ష రాసేందుకు ప్రభుత్వానికి కట్టవలసిన ఫీజు 800 నుండి 1000 రూపాయలు ఉండగా ఓ ఉపాధ్యాయుడు ఏకంగా 10000 రూపాయలను పరీక్ష రాసేందుకు వసూలు చేయటం మొదలుపెట్టారు. ఓపెన్ టెన్త్ పరీక్ష రాసేందుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ కోసం వేచి చూసి ఉద్యోగులు అవటం ఉపాధ్యాయులకు ఒక వరంలా మారింది. ఇదేమని ప్రశ్నిస్తే 10 వేలు ఇస్తేనే ఎగ్జామ్ ఓపెన్ గానే జరుగుతాయని లేదంటే మరి ఎక్కడైనా రాసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం జరుగుతుందని బాధితులు తెలిపారు. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులకు పులు ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు లేకపోవడంతో జిల్లా అధికారులకు సైతం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఆర్థిక స్థోమత లేక పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించలేని బాధితులు ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తే .. నువ్వు చెయ్యి మీకే అర్థమవుతుంది. కింద స్థాయి అధికారులు నుండి పై స్థాయి అధికారి వరకు ముడుపులు ఇవ్వాలని మాకు ఇంత కష్టపడ్డా మాకు ఏమి మిగలదంటూ ఆగ్రహం వెలిబుచ్చారు ..ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.
Tags: ZP is a high school teacher who is charging heavily for the open tent exam