23న జెడ్పి స్థాయి సంఘ సమావేశం-జెడ్పి సీఈవో సుధాకర్ రెడ్డి

కడప ముచ్చట్లు:

 

ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాన్ని  నిర్వహించనున్నట్లు జెడ్పి సీఈవో సుధాకర్ రెడ్డి  బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ.. ఈనెల 23న గౌరవ జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ స్థాయి సంఘ సమావేశాన్ని.. స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జెడ్పి సమావేశ మందిరం నందు నిర్వహించ నున్నట్లు తెలియజేయడమైనది. సమావేశానికి ఆయా సంఘాల సభ్యులందరూ జిల్లాలో సంబంధిత శాఖల పరిధిలో అభివృద్ధి ప్రగతి నివేధికలతో పాటు  అభివృద్ధి చేయాల్సిన అంశాల ప్రతిపాదనలకు సంబంధించి సమగ్ర సమాచారంతో  హాజరు కావాలని ఆయన కోరారు.

 

Tags: ZP level Sangha meeting on 23-ZDP CEO Sudhakar Reddy

Leave A Reply

Your email address will not be published.