Natyam ad

సిద్ధమవుతున్న హెల్త్ ప్రొఫైల్..

మెదక్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి‌ష్ఠా‌త్మకంగా చేప‌ట్టిన ‘తె‌లం‌గాణ హెల్త్‌ ప్రొఫైల్‌’ను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలం‌గాణే లక్ష్యంగా అడు‌గులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రం‌లోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమా‌చార నివే‌దిక (హెల్త్‌ ప్రొఫైల్‌) సిద్ధం చేయా‌లని నిర్ణయించింది. దీనికోసం పైలట్‌ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా సర్వేను మంత్రి హరీశ్‌ రావు ములుగు జిల్లా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా దవాఖాన భవనం, రేడియాలజీ ల్యాబ్, పిడియాట్రిక్ యూనిట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.హెల్త్‌ ప్రొఫై‌ల్‌తో ఎన్నో ప్రయో‌జ‌నాలు వున్నాయంటున్నారు నిపుణులు. హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయ‌డంలో భాగంగా వైద్యసి‌బ్బంది ఇంటిం‌టికీ వెళ్లి, ప్రతి వ్యక్తి ఆరోగ్య సమా‌చా‌రాన్ని సేక‌రిం‌చ‌ను‌న్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యే‌కంగా ఒక ఐడీ నంబర్‌ ఇస్తారు. వారి నుంచి నమూ‌నా‌లను సేక‌రించి, 30 రకాల డయా‌గ్నో‌స్టిక్‌ పరీ‌క్షలు నిర్వహి‌స్తారు. ఫలి‌తాల ఆధా‌రంగా వారి ఆరోగ్య సమ‌స్యలను నిర్ధా‌రి‌స్తారు. ఒక‌వేళ ఏవైనా సమ‌స్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారం‌భి‌స్తారు. వివ‌రా‌ల‌న్నిం‌టినీ ఎప్పటి‌క‌ప్పుడు ఆన్‌‌లైన్‌ చేస్తారు.ఈ సమా‌చా‌రంతో అనేక ప్రయో‌జ‌నాలు కలు‌గ‌ను‌న్నాయి. దీర్ఘకా‌లిక బాధి‌తు‌లను గుర్తిం‌చడం, వారికి మెరు‌గైన వైద్యం అదిం‌చడం, క్యాన్సర్‌ వంటి రోగా‌లను ప్రాథ‌మిక దశ‌లోనే గుర్తిం‌చడం, రక్తహీ‌నత వంటి సమ‌స్యలను గుర్తించి తగిన చికిత్స అందిం‌చడం.. ఇలా అనేక ప్రయో‌జ‌నాలు కలు‌గ‌ను‌న్నాయి. వైద్యరంగంలో ఈ పథకం మరో మైలురాయి అంటున్నారు వైద్యరంగ నిపుణులు.
 
Tags:Preparing Health Profile