Natyam ad

మూడేళ్ల నుంచి ముందుకు సాగని నిర్మాణాలు

వరంగల్ ముచ్చట్లు:
 
 
రాష్ట్రంలో మూడేండ్లుగా సర్కారు బడులకు కొత్త బిల్డింగ్ ల నిర్మాణాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజాప్రతినిధుల నుంచి అనేక ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నా, ప్రభుత్వం మాత్రం నిర్మాణాలను చేపట్టడం లేదు. కేంద్రం నుంచి కొత్త బిల్డింగుల నిర్మాణానికి నిధులు రావడం లేదంటూ ప్రభుత్వం వీటిని పెండింగ్ లో పెడుతూ వస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, గతంలో ఇచ్చిన నిధులను సక్రమంగా వాడలేదని, మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదన్న కారణంతో కేంద్రం ఫండ్స్ ఆపేసింది. కేంద్రం చెప్పినా పెండింగ్ పనులు పూర్తి చేయకపోవడంతో వచ్చే ఏడాది కూడా ఫండ్స్ వచ్చే చాన్స్ లేదని చెప్తున్నారు. రాష్ట్రంలో 26 వేలకు పైగా సర్కారు బడులున్నాయి. వీటిలో సుమారు12 వేల వరకూ అడిషనల్ క్లాసు రూంలు కావాలని గతంలో అధికారులు లెక్కలేశారు. ఆ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగి ఉంటుంది. సుమారు 300 స్కూళ్ల బిల్డింగ్లు శిథిలావస్థలో ఉన్నాయి. ఏటా కేంద్రం సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ద్వారా ఇచ్చే నిధులతోనే స్కూల్ బిల్డింగ్లు, టాయ్ లెట్లు, ప్రహారీగోడలు నిర్మిస్తున్నారు. కానీ 2018–19 నుంచి కేంద్రం నిర్మాణాలకు నిధులను తగ్గించి, క్వాలిటీ ఎడ్యుకేషన్కు పెంచింది. అయితే, తెలంగాణకు గతంలో నిర్మాణాల కోసం ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చుచేయలేదని గుర్తించినట్లు 2021–22 కేంద్ర ఎస్ఎస్ఏ పీఏబీ మినిట్స్లోనే పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో 2020–21లో 952 పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిలో107 మాత్రమే పూర్తయ్యాయని గుర్తుచేశారు.
 
 
 
డిసెంబర్ 2021నాటికి వాటిని పూర్తిచేయాలని స్పష్లం చేశారు. అయినా ఆ పనులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేదు. దీంతో వచ్చే ఏడాది కూడా బిల్డింగ్ ల నిర్మాణానికి ఫండ్స్ ఇచ్చేది డౌటేనని అధికారులు చెప్తున్నరు. అలాగే గతంలో బడుల్లో పనులు చేయించిన స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ప్రతినిధులకు కూడా ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించలేదు. సర్కారు బడుల్లో సౌలతుల కోసం ‘మన ఊరు మన బడి’ స్కీమ్ తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మూడు విడతల్లో అన్ని బడుల్లో ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పింది. ఈ ఏడాది 9,123 బడులను ఎంపిక చేసినట్టు తెలిపింది. దీంట్లో కొత్తగా అడిషనల్ క్లాస్ రూంలు, టాయ్ లెట్లు, ప్రహరీగోడలను నిర్మిస్తామని చెప్పింది. అయితే, వీటికి కూడా కేంద్రం నుంచే ఫండ్స్ పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ లో జరగనున్న పీఏబీ మీటింగ్ లో.. ఈ ఏడాదికి ఎన్ని ఫండ్స్ అడగాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కీమ్ పెట్టినందున కేంద్రం ప్రోత్సహిస్తుందని, నిధులు కూడా ఎక్కువగానే కేటాయించే చాన్స్ ఉందని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మళ్లీ మూడేండ్ల తర్వాత కేంద్రం ఇచ్చే నిధులతోనే కొత్త స్కూల్ బిల్డింగుల నిర్మాణాలు షురూ కానున్నాయి.
 
Tags:Structures that have not progressed since three years