Natyam ad

ఇష్టపూర్వక శృంగారం లేదా సహజీవనానికి 18 ఏళ్ళు తప్పనిసరి

–    పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో స్పష్టం చేసిన  కేంద్ర ప్రభుత్వం

న్యూ డిల్లీ  ముచ్చట్లు:

తమకు నచ్చిన వ్యక్తితో ఎవరైనా శృంగారం చేయడానికి లేదా సహజీవనం చేయడానికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలనే నిబంధన మనదేశంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వయసును రెండేళ్లు తగ్గించి 16 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం చేరుస్తుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఇష్టపూర్వక శృంగారం లేదా సహజీవనం చేయడానికి ఉన్న 18 ఏళ్ల వయసును తగ్గించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు తెలిపింది. రాజ్యసభలో సీపీఐ ఎంపీ బినయ్ విశ్వం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టతనిచ్చారు. యువతీయువకులు ఏకాభిప్రాయంతో సహజీవనం చేయడానికి ప్రస్తుతం ఉన్న వయసును తగ్గించే ఆలోచన లేదని వివరించారు.చిన్నారులపై లైంగిక దాడులు దోపిడీ నుంచి రక్షణకు 2012లో కేంద్రం పోక్సో చట్టం తెచ్చిందని స్మృతి ఇరానీ పార్లమెంటుకు వివరించారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు ఉన్నవారిని పిల్లలు (మైనర్లు)గా పరిగణిస్తామని వెల్లడించారు.ఈ నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

 

 

Post Midle

అదేవిధంగా సహజీవనానికి కనీస వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించే నిర్ణయాన్ని  కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుండబద్దలు కొట్టారు.2012లో రూపొందించిన పోక్సో చట్టం (పిల్లలను లైంగిక వేధింపులు లైంగిక నేరాల నుంచి రక్షించే చట్టం) 18 ఏళ్ల  కంటే తక్కువ వయసున్న వారిని పిల్లలుగా స్పష్టంగా పేర్కొందని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. నేరం తీవ్రతను బట్టి పోక్సో చట్టం శిక్షను విధిస్తుందని తెలిపారు. అలాగే ఒక వ్యక్తి పిల్లలా కాదా అనే దానిపై ప్రత్యేక కోర్టు ముందు జరిగే ఏదైనా విచారణలో ప్రశ్న తలెత్తితే అటువంటి వాటికి పరిష్కారం కూడా కోర్టు నిర్ణయిస్తుంది అని స్మృతి ఇరానీ స్పష్టత నిచ్చారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం.. బాల్య వివాహాలు గత కొన్నేళ్లుగా పెరిగాయని ఇది విచారించదగ్గ అంశమని చెప్పారు. వీటిని తగ్గించడానికి బేటీ బచావో… బేటీ పడావో మహిళా హెల్ప్లైన్ వంటి వాటిని కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 

Tags: 18 years is mandatory for consensual sex or cohabitation

Post Midle