కొత్తపల్లిలో దారుణం…

కొత్తపల్లిలో దారుణం…

కరీనంగర్ ముచ్చట్లు:

కరీంనగర్ శివారు కొత్తపల్లి పట్టణంలో ఓ ప్రేమ పేరుతో  ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎన్ని సార్లు కోరినా తనను ప్రేమించడం లేదని తన ఎదురింటి యువతిపై బ్లేడ్తో దాడి చేశాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న  24 ఏళ్ల యువతి కావ్య శ్రీ (25 )ని ఇంటి ఎదురుగా ఉండే బొద్దుల సాయి గత మూడు నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాని వెంటపడుతున్నాడు. సదరు విషయం యువతి తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో పంచాయతీ పెట్టి యువకుణ్ని హెచ్చరించారు.  అయితే కొద్ది కాలం పాటు మౌనంగా ఉన్న సాయి అమ్మాయిని తాను తప్ప ఎవరూ పెళ్లి చేసుకోకూడదు అంటూ పలుమార్లు సన్నిహితుల వద్ద వాదనకు దిగాడు. ఇదే విషయంపై అమ్మాయి తండ్రికి సైతం ఫోన్లో మెసేజ్ పంపిస్తూ ఉండేవాడు.. అయితే అటువైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అధర్ చూసిన సాయి కావ్య శ్రీ పై దాడికి దిగగా అరుపులు కేకలు విన్న చుట్టుపక్కల వారు సమయానికి స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ యువతిని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు.

 

Tags: Atrocious in Kothapally…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *