Natyam ad

1000 కోట్ల క్లబ్ లో  డంకీ

ముంబై ముచ్చట్లు:

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈఏడాది ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న కింగ్ ఖాతాలో ఏకంగా రెండు బ్లాక్ బస్టర్స్ చేరాయి. పఠాన్, జవాన్ సినిమాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు షారుఖ్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లు కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ఇప్పుడు డంకీ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ కీలకపాత్రలు పోషించారు. ఈ ఏడాది రెండు మాస్ యాక్షన్ సినిమాలతో అలరించిన షారుఖ్.. ఇప్పుడు ‘డంకీ ‘ సినిమాతో ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అయ్యారు. ట్రైలర్, టీజర్, పోస్టర్లతో ఆసక్తిని పెంచేసిన ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే పలు చోట్లు ఈ మూవీ ప్రీమియర్ షోస్ చేసేశారు అడియన్స్. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ‘డంకీ ‘ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.‘డంకీ ‘ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ కలిసి మరోసారి రూ.1000 కోట్ల మార్క్ చేరుకుంటారని ఓ ట్వీట్ చేశారు. షారుఖ్ ఖాన్ రికార్డ్స్ సృష్టిస్తున్నారు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ‘డంకీ ‘ బ్లాక్ బస్టర్ హిట్.. రాజ్ కుమార్ హిరానీ 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ తర్వాత మరో మాస్టర్ పీస్ క్రియేట్ చేశారంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

Post Midle

Tags: Dunky in the 1000 crore club

Post Midle