Natyam ad

బిగ్ బాస్ విన్నర్స్ ఏం చేస్తున్నారు…

హైదరాబాద్ ముచ్చట్లు:

బిగ్ బాస్ రియాలిటీ షో అనేది తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. దాంతో పాటు ఎక్స్‌క్లూజివ్‌గా ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తయ్యింది. అయితే ఓటీటీ సీజన్‌లో తప్పా మిగతా అన్ని సీజన్స్‌లో మగవారే విన్నర్స్ అయ్యారు. మరి అంతమంది అభిమానులను సంపాదించుకొని, ఓట్ల విషయంలో మిగతా అందరినీ దాటి విన్నర్స్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది.
కనిపించని బిగ్ బాస్ విన్నర్..
బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్‌గా నిలిచాడు శివబాలాజీ. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శివబాలాజీ.. బిగ్ బాస్ హౌజ్‌లో తనలాగే ఉంటూ.. పెద్దగా నటించకుండా అభిమానులను ఆకట్టుకున్నాడు. అందుకే విన్నర్ అయ్యాడు. మరి విన్నర్ అయిన తర్వాత శివబాలాజీ ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవాలని బిగ్ బాస్ ప్రేక్షకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు తగ్గిపోయినా.. పలు షోలలో కంటెస్టెంట్‌గా, జడ్జిగా కూడా వ్యవహరించాడు శివబాలాజీ.
ఫలించని కౌశల్ ఆర్మీ కష్టం..
బిగ్ బాస్ సీజన్ 2లో ఎవరు విన్నర్ అవుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. కౌశల్‌ను అందరూ టార్గెట్ చేస్తున్నారని జాలితో ఆడియన్స్ అంతా ఏకగ్రీవంగా తనను విన్నర్ చేశారు. మరి అంత హడావిడి చేసి ఆడియన్స్ కలిసి విన్నర్ చేసిన కౌశల్.. ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అని అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొంతకాలం వరకు షాప్ ఓపెనింగ్స్‌కు పాల్గొన్న కౌశల్.. ఇప్పుడు బిగ్ బాస్ షోపై రివ్యూలు ఇస్తున్నాడు.
ఆస్కార్ స్టేజ్‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్..
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. బిగ్ బాస్‌లోకి వచ్చేముందు పాటలు పాడుతూ బిజీగా ఉన్న రాహుల్.. తర్వాత కూడా అదే ప్రొఫెషన్‌లో బిజీ అయిపోయాడు. అదనంగా కొన్ని షోలలో కూడా పాల్గొన్నాడు. ‘నాటు నాటు’ అనే పాటతో ఆస్కార్ స్టేజ్‌పై పాల్గొనే అవకాశం లభించింది. ఇప్పుడు తను బిగ్ బాస్‌లో పాల్గొన్న విషయాన్ని కూడా అందరూ మర్చిపోయినా.. ఆస్కార్ పాట పాడిన సింగర్‌గా మిగిలిపోయాడు రాహుల్.
ఛలో అమెరికా..
బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ విన్నర్‌గా నిలిచాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’తో హీరోగా పరిచయమయ్యాడు అభిజిత్. బిగ్ బాస్‌లో మైండ్ గేమ్స్ ఆడి విన్నర్ అయిన తర్వాత అభిజిత్.. మళ్లీ సినిమాల్లో బిజీ అవుతాడని అనుకున్నారు. కానీ విన్నర్ అయిన తర్వాత తిరిగి అమెరికాకే వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో మాత్రమే ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ తన పర్సనల్ లైఫ్ గురించి పోస్టులు పెడుతుంటాడు.
హీరోగా మారాడు..
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరో అయిపోయాడు. బిగ్ బాస్‌కు ముందు జర్నలిస్ట్‌గా, యాంకర్‌గా, సీరియల్ హీరోగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న సన్నీకి ఇప్పుడు ఏకంగా హీరో ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే తను హీరోగా నటించిన పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు వస్తున్నా.. హీరోగా తగిన గుర్తింపు మాత్రం సాధించలేకపోయాడు.
పెద్దగా మార్పు లేదు..
బిగ్ బాస్ సీజన్ 6లో విన్నర్ అయిన రేవంత్ జీవితంలో కూడా పెద్దగా మార్పులు రాలేదు. బిగ్ బాస్‌కంటే ముందే సింగర్‌గా తగిన గుర్తింపు సంపాదించుకున్నాడు రేవంత్. అందుకే బిగ్ బాస్ విన్నర్ అయినా కూడా అది తన కెరీర్‌లో ఒక చాప్టర్‌లాగా మాత్రమే మిగిలిపోయింది. ఎప్పటిలాగానే సినిమాల్లో పాటలు పాడుతూ బిజీగా గడిపేస్తున్నాడు.
పల్లవి ప్రశాంత్ పరిస్థితి కూడా అంతే..
ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు ఎంత క్రేజ్ ఉన్నా.. కొంతకాలం తర్వాత ప్రశాంత్ గురించి కూడా అందరూ మర్చిపోతారు అని హేటర్స్ విమర్శిస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీలో విన్నర్ అయిన బిందుమాధవి.. ఈ రియాలిటీ షోలో విన్నర్ అయిన ఒకేఒక్క లేడీ కంటెస్టెంట్‌గా రికార్డ్ సాధించింది. ఒకప్పుడు తెలుగులో హీరోయిన్‌గా నటించినా.. కొన్నాళ్ల తర్వాత బిందుమాధవి గురించి అందరూ మర్చిపోయారు. కానీ బిగ్ బాస్ తర్వాత మళ్లీ బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్ ఆఫర్లతో బిజీ అయ్యింది ఈ తెలుగమ్మాయి.ఇక అయితే సమయంలో లక్షల కోట్ల రూపాయలకు లెక్కలు తారు మారు చేసే సత్తా అధికారులకు ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

Post Midle

Tags: What are Bigg Boss winners doing?

Post Midle