రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
ఆదిలాబాద్ ముచ్చట్లు:
ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యవాత పడగా.. ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన గుడిహత్నూర్ మండలం, సీతాగొంది వద్ద చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు కారులో వెళ్తున్నారు. గుడిహట్నూర్ మండలం సీతాగొంది సమీపంలో ఆదిలాబాద్ వైపు వెళుతున్న కంటైనర్ను వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. లారీ వెనుక ఇరుక్కుపోయిన మృతదేహాలను రెండు క్రేన్ల సాయంతో బయటకు తీశారు. మృతుల్లో డ్రైవర్ శంశు, సయ్యద్ రఫీతుల హస్మి, వజహబ్ హస్మి, సలీమా, జూబియాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Four died in a road accident

