Natyam ad

ఘనంగా జనహృదయనేత జన్మదిన వేడుకలు

రామసముద్రం ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కెసిపల్లె సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పాదయాత్ర ద్వారా చూసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలే అజెండాగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను గ్రామ సచివాలయంలో వాలింటర్లు ద్వారా అందిస్తూ ప్రజా అభిమానాన్ని అనతికాలంలోనే చూరగొన్న నాయకుడిగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారన్నారు. అనంతరం మిఠాయిలు, కేక్ పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది భారతి, బత్తెమ్మ, ఉపేంద్ర, మూర్తి, శ్రీనివాసులు, స్థానిక నాయకులు బాబు, ఎల్లారెడ్డి, ఇర్షాద్, ఎఫ్ ఎ వెంకటరమణ, వాలింటర్లు శ్రావణి, రేవతి, మేఘన, రెడ్డెమ్మ, పుష్పావతి, దినకర్, హరీష్, రామచంద్ర, ప్రదీప్, కుమారస్వామి, గృహ సారుదులు మునస్వామి, నాగిరెడ్డి, బి. వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Grand birthday celebrations

Post Midle