Natyam ad

 నేటి నుండి సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి భజన సప్తహ వారోత్సవాలు.

కమాన్ పూర్ ముచ్చట్లు:

ఉమ్మడి కమాన్ పూర్ మండలం ప్రస్తుత రామగిరి మండలం సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి భజన సప్తాహ వారోత్సవాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి రాజ్ కుమార్ గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మీ రాజలింగు తెలిపారు.
గురువారం నుండి ఈనెల 11 తేదీ గురువారం కార్యక్రమాలు జరగనున్నాయి. లోక కళ్యాణార్ధము పవిత్ర గోదావరి నది ఒడ్డున సుందిల్ల గ్రామములో వెలసిన కలియుగ దైవం శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానములో…
భజన సప్తాహ మహోత్సవములు
ప్రతిరోజు రేయింబవళ్ళు భజన జరుగును. మరియు అన్నదానం జరుగును. కావున భక్తులెల్లరు దక్షిణాభిముఖుడై వెలసి, దివ్యతేజమూర్తియైన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించి, సేవించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి.
ఉత్సవ సందర్భముగా కార్యక్రమములు
04-01-2024 గురువారం రోజున ఉదయం 5-00 గంటలకు శ్రీస్వామి వారిక
అభిషేకము, అర్చన మరియు సంకల్పము,ఉ॥ గం॥ 9-30 ని॥లకు : నవగ్రహారాధన, కలశస్థాపనము.
: తదుపరి ‘భజన సప్తాహ ప్రారంభము’
తేది 11-01-2024 గురువారము: ఉ॥ గం॥ 11-30 ని॥లకు భజన సప్తాహ ముగింపు ఉత్సవము. గోపాల కాల్వలతో ఊరేగింపు,
ఈ దేవస్థానము పెద్దపల్లి జిల్లా రామగిరి మండలములోని సుందిల్ల గ్రామములో గలదు. ఈ దేవాలయము క్రీ.శ. 11వ శతాబ్దములో కాకతీయ రాజ వంశస్థుల కంటే ముందు నిర్మించినట్లు ఈ దేవాలయము గోదావరినదికి కేవలము 2 1/2 కి.మీ. దూరంలో నున్నది. 2015 సం॥లో పుష్కర ఘాట్ కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ దేవాలయము దక్షిణాభిముఖముగా నుండుట చాలా ప్రశస్తము. శ్రీ స్వామి వారు యోగానంద స్వరూపుడై
ఉన్నాడు. శ్రీస్వామి వారు హిరణ్యకశ్యపుని వధించి ఉత్తరాభిముఖంగా వెళ్తున్న స్వామిని ప్రహ్లాదుడు వెనుక నుండి పిలువగానే బాలునికి ఏ ఆపద వచ్చిందో అని తిరిగి అలాగే వెలిశాడని. చెపుతారు. శ్రీ స్వామి వారు యోగానంద స్వరూపుడై ఉన్నాడు. ఇట్టి విగ్రహము ఇసుక రాతితో మలచినదైనను ఇరు పార్శ్వములు ఒక వైపు ఎరుపు, ఒకవైపు నలుపు కలిగి యుండుట ఆశ్చర్యముగానుండును.
గత కొద్ది కాలము క్రితము భక్తుల కోరిక ననుసరించి దేవస్థానము వారు శ్రీ లక్ష్మి అమ్మవారిని ప్రతిష్ట చేసినారు. నాటి నుండి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిగా ప్రసిద్ధి చెందినారు. ఈ దేవాలయమునకు పశ్చిమమున 50 గజాల దూరంలో కాకతీయుల కాలమునకే చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయము మరియు 100 గజముల దూరమున శ్రీ ఆంజనేయస్వామి దేవాలయము కలిగి యుండుట ఇచ్చట ప్రాశస్త్యము.

Post Midle

ఈ దేవాలయములో ఆరోగ్యరిత్యా గ్రహా బాధలు, చేతబడులు ఉన్నవారు స్వామి వారి దగ్గర దీక్షగా ఉన్నచో వారికి స్వామి వారి స్వప్నంలో కనబడి తీర్థప్రసాదములు ఇచ్చి ఇంటికి వెళ్ళిపొమ్మంటాడు. స్వప్నంలోనే వారి కోరికలను స్వామి వారు తీర్చుతుంటారు. ఈ దేవాలయము ధర్మాదాయ శాఖ ఆధీనములోకి వచ్చి తదుపరి కమిటి నిర్వాహకులు మరియు కార్యనిర్వాహణాధికారులు శ్రమించి భక్తుల, మరియు దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్ధము నివాస యోగ్యమగు గదులను మరియు స్వామి వారికి కళ్యాణము గురించి మండపము నిర్మింపజేసినారు. స్వామి వారి దేవాలయంలో జరుగు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు చేసుకొనుటకు సామూహికంగా వ్రతములు జరుపుకొనుటకు గాను పెద్ద హాలును నిర్మించినారు. భక్తుల సౌకర్యార్ధము ధారాళముగా నీటి వసతి కలిగియున్నది. మరియు భక్తుల వసతి గురించి మరుగు దొడ్లు కూడా నిర్మించబడినది.
భక్తులు అన్నదానం చేయదలచిన వారు ఆలయ కార్యాలయంలో నెల ముందుగా సంప్రదించగలరు.
ఈ ఆలయములో అతిముఖ్యమైన ఉత్సవములు:
1. ధనుర్మాసము సందర్భముగా సంక్రాంతి పండుగ ముందు భజన సప్తాహము.
2. ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు మూడు రోజులు స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవములు జరుగను.
3. ఉగాది జాతర
4. వైశాఖ శుద్ధ చతుర్దశినాడు స్వామివారి జయంతి ముందు 21 రోజు మాలధారణ జయంతికి స్వామి వారి మాల విరమణ.
న్యూఅశోక్ టాకీస్ వద్ద నుండి సుందిల్లకు ఆటో సౌకర్యము కలదు. వాహనాల పై వచ్చే వారు 2 ఇంక్లయిన్ మైన్ వద్ద నుండి కొత్తగా రోడ్డువేసినారు. ప్రజలు ఈ రోడ్డు ద్వారా రాగలరు. కత్తులు అతిగా సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Tags: Sundilla Shree Lakshminarasimhaswamy Bhajan Seven Weeks from today.

Post Midle