Natyam ad

మోడీ రూట్ మ్యాప్ ఇచ్చేశారా

విశాఖపట్టణం  ముచ్చట్లు:


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో రోడ్ మ్యాప్ అడుగుతున్నా మిత్ర పార్టీ బీజేపీ పెద్దల నుంచి పెద్దగా స్పందన కనిపించేది కాదు. ఇదే విషయాన్ని ఇటీవల జనసేన పార్టీ నేతలు, శ్రేణులతో మంగళగిరిలో నిర్వహించిన సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ కాస్త గట్టిగానే ప్రస్తావించారు. అయితే.. ఇటీవల ప్రధాని మోడీ విశాఖలో పర్యటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పీఎంఓ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. అలాగే.. బీజేపీ కోర్ కమిటీ కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ కు కేవలం పది నిమిషాల సమయం ఇచ్చినప్పటికీ.. అరగంటకు పైగా ఆయనతో మోడీ చర్చలు జరపడం విశేషం. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారనే ఊహాగానాలు వస్తున్నాయి.ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేసేందుకు టీడీపీ-జనసేన-బీజేపీలతో కలిపి ఉమ్మడి విపక్షం ఏర్పాటు కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఉమ్మడి విపక్షానికి బదులు జనసేన-బీజేపీతో కూడిన పరిమిత విపక్షాన్ని బలోపేతం చేయాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారని అంటున్నారు. అందుకేనేమో మోడీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విపక్షం విషయంలో మౌనం వహిస్తున్నట్లు కనిపిస్తోందని ఏపీలో తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది.మోడీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో అరగంటకు పైగా చేసిన చర్చలే ప్రధాని విశాఖపట్నం పర్యటనలో కీలకంగా మారాయంటున్నారు. విశాఖలో తన తొలి రోజు పర్యటనలో పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు.

 

 

 

తర్వాతి రోజు మోడీ టూర్ లో గవర్నర్, సీఎం జగన్ కనిపించారు. విశాఖలో తొలిరోజు పర్యటనను మోడీ రాజకీయ చర్చలతో ప్రారంభించారు. తద్వారా తన ప్రాధాన్యతలు ఏమిటో మోడీ చెప్పకనే చెప్పారంటున్నారు. రెండో రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ గడిపారు. అంటే.. ఏపీలో మోడీ పర్యటనలో రాజకీయ పార్టీలకు ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటన్నది స్పష్టం చేశారంటున్నారు.వైజాగ్ లో తన పర్యటనను పోలీసుల ద్వారా అడ్డుకున్న వైసీపీ సర్కార్ తీరుతో  పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రవేశాలకు గురయ్యారు. విశాఖ నుంచి మంగళగిరి వచ్చిన పవన్ కళ్యాణ్ వైసీపీ  నేతలు, మంత్రులకు చెప్పు చూపించి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ఏపీలో తీవ్ర సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సభ తరువాత విజయవాడలో బస చేసిన హొటల్ కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారువైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ-జనసేన-బీజేపీలతో బలమైన ఉమ్మడి ప్రతిపక్షం ప్రతిపాదన చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉత్సాహానికి ప్రధాని మోడీ తన రూట్ మ్యాప్ ద్వారా బ్రేక్ వేశారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. నిజానికి టీడీపీ-జనసేన-బీజేపీలతో ఏర్పడిన ఉమ్మడి విపక్షం అయితే.. అధికార వైసీపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించవచ్చనే అభిప్రాయాలు  సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి టీడీపీతో పొత్తు గురించి ఆలోచించవద్దని,

 

 

 

బీజేపీ-జనసేన మాత్రమే కలిసి ముందుకు వెళ్లాలని, వచ్చే ఎన్నికల నాటికి అవసరం, అవకాశాన్ని బట్టి టీడీపీతో పొత్తు విషయం చూద్దామని పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోడీ చెప్పినట్లు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్లే పవన్ కళ్యాణ్ నిరుత్సాహం కలిగిందంటున్నారు. మోడీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మాటల్లో ఆ నిరుత్సాహమే కనిపించిందంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండానే  వెళ్లిపోయారంటున్నారు. అందుకే మోడీతో సమావేశం సందర్భంగా తమ మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలు చెప్పకుండా పవన్ మౌనం వహించారంటున్నారు.సుమారు ఎనిమిదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో మోడీ ప్రత్యేకంగా భేటీ అవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. జనసేనను ఓ రాజకీయ పార్టీగా గుర్తించబోమని చెబుతున్న వైసీపీ సర్కార్ కు పవన్ కు అంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మోడీ గట్టి ఝలక్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

Tags: Did Modi give the route map?