Natyam ad

పోలీయో పోరాటయోధుడికి పద్మశ్రీ

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.పోలియో వ్యాధితో బాధపడే వ్యక్తుల పాలిట ఆత్మబంధువుగా పేరు సంపాదించుకున్న ఆదినారాయణ ఇప్పటివరకు మూడు లక్షలకుపైగా శస్త్ర చికిత్సలు చేశారు. దేశవ్యాప్తంగా ఆయన 989 వైద్య శిబిరాలు నిర్వహించారు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆదినారాయణ అక్కడే పాఠశాల, ఇంటర్‌ చదువు పూర్తిచేసి…1960లో ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరారు. అనంతరం 1970లో ఎంఎస్‌ చేశారు.తొలిసారి 1978లో పాలకొల్లులో సత్యనారాయణమూర్తి అనే వైద్యుడి సహాయంతో తొమ్మిది మందికి ఆదినారాయణ పోలియో ఆపరేషన్లు నిర్వహించారు. కాగా విశాఖపట్నం నుంచి గతంలో డాక్టర్‌ కూటికుప్పల సూర్యరావు, డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లు పద్మ అవార్డులు అందుకున్నారు. డాక్టర్‌ ఆదినారాయణ మూడోవారు.వైద్య రంగంలో సుదీర్ఘకాలంగా వున్న తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై డాక్టర్‌ సుంకర ఆదినారాయణ హర్షం వ్యక్తం చేశారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Padma Shri for Polio Fighter