Natyam ad

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బ్రొచర్ ను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ భూమన

తిరుపతి ముచ్చట్లు:


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అందరి సహకారాలతో ఎంత ఘనంగా నిర్వహించామో అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను మరింత వైభోవపేతంగా నిర్వహించి భక్తులు అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తామని
టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 10 నుంచి 18 వరకు జరగనున్నాయి. టీటీడీ వారు కార్తీక బ్రహ్మోత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందర కార్తీక బ్రహ్మోత్సవాల వివరాలు గల బ్రోచర్ను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యవారి బ్రహ్మోత్సవాలు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించామో అదేవిధంగా నే అమ్మవారి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలను వివరిస్తూ
నవంబర్ 7వ తేదీతో అంకురార్పణతో  కార్తీక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుడుతామని 9వ తేదీన లక్ష కుంకుమార్చన క్రతువు ఉంటుందని అన్నారు.

 

 

అలాగే10వ తేదీ ధ్వజారోహణం తో సకల దేవతలకు ఆహ్వానం పలికి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.14వ తేదీన కార్తీక బ్రహ్మోత్సవాలలో అమ్మవారికి ప్రీతికరమైన  గజవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం  కల్పిస్తారని అన్నారు కార్తీక బ్రహ్మోత్సవాలలో ముఖ్యగట్టమైన 18వ తేది పంచమి తీర్థం ఉంటుందని ఆ రోజు చక్రస్నానికి వచ్చే భక్తులందరికీ దర్శన ఏర్పాట్లు చేస్తామని అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలిపారు.9 కోట్ల రూపాయలు తో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు ఆలయ పుష్కరిణీ సుందరీకరణ చేస్తున్అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి జేఈవో వీరబ్రహ్మం డిప్యూటీ ఈవో గోవిందరాజన్ ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ మధుసూదన్ శేషగిరి ఇన్స్పెక్టర్లు గణేష్ సుభాస్కర్ ప్రసాద్ ఏవీఎస్ఓ శైలేంద్ర బాబు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తిరుచానూరు సిఐ బి శివ ప్రసాద్ రెడ్డి ఎస్సై వెంకటసుబ్బయ్య  టీటీడీ ఉద్యోగస్తులు విజిలెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: TTD Chairman Bhumana unveiled the brochure of Tiruchanur Sri Padmavati Ammavari Kartika Brahmotsavam.

Post Midle