Natyam ad

నవంబర్ నెల 3,4,5 తేదీలలో మెగా సీ ఫుడ్ ఫెస్టివల్….

హైద్రాబాద్ ముచ్చట్లు:


మెగా సీ ఫుడ్ ఫెస్టివల్ వాల్ పోస్టర్ ను విడుదల చేసిన బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డిబనగానపల్లెబనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు  మెగా సీ ఫుడ్ ఫెస్టివల్ వాల్ పోస్టర్ ను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభలు కాటసాని రామిరెడ్డి  విడుదల చేశారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కారసాని రామిరెడ్డి  మాట్లాడుతూ, నవంబర్ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో కర్నూల్ టౌన్ రావూరి గార్డెన్ నందు మెగా సీ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కర్నూలు నంద్యాల కడప అన్నమయ్య అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో అన్నింటిని కలిపి మెగాసి ఫుడ్ ఫెస్టివల్ ను భూమి ఆర్గానిక్స్ మరియు మత్సశాఖ ఆధ్వర్యంలో  కర్నూలు పట్టణం నందు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.ఈ మెగాసి ఫుడ్ ఫెస్టివల్ ను నంద్యాల ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఫిష్ ఆంధ్ర బ్రాండ్ పథకం ద్వారా లక్ష నుండి 50 లక్షలు గల యూనిట్లను మరియు కోటి రూపాయల విలువ గల యూనిట్లుగా ఏర్పాటు  చేసుకోవాలని కాబట్టి పారిశ్రామికవేత్తలు ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో మత్సఅభివృద్ధి అధికారి పామన్న, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ శిరోమణి, బనగానపల్లె సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.

 

Tags: Mega Sea Food Festival on November 3, 4, 5…

Post Midle
Post Midle