Natyam ad

రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి

రంగారెడ్డి ముచ్చట్లు:
 
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీ కూతురు
చనిపోగా… తండ్రి మరో కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలంలోని కేసారం గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ శివరాంపల్లికి చెందిన రవికిరణ్, స్రవంతి తమ కుమార్తెలు ధ్రువిక,
మోక్షలతో కలిసి వికారాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కేసారం గేటు వద్దకు రాగానే… వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తల్లి స్రవంతి, కుమార్తె ధ్రువిక అక్కడికక్కడే చనిపోయారు.
తండ్రి రవికిరణ్, మోక్షలకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే, మరో కారులో ఉన్న వ్యక్తి సైతం తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న
పోలీసులు ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు.
 
Tags:Two cars collided .. Three killed