Natyam ad

వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హజరయిన ఎమ్మెల్సీ కవిత

కరీంనగర్ ముచ్చట్లు:
 
కరీంనగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  హజరయ్యారు. నగరం లోని మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారికీ ప్రత్యేక పూజలు జరిపించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కరీంనగర్ లోని స్వయంభు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం నా అదృష్టం. మంత్రి గంగుల కమలాకర్ గారు అద్భుతంగా స్వామి వారి వేడుకలని నిర్వహిస్తున్నారు. తిరుపతి లో మాడ వీధులు ఉన్నట్టుగానే ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయం. స్వామి వారి అనుగ్రహం తెలంగాణ పై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
 
Tags: Venkateswaraswamy is an MLC poet who attended Brahmotsava