Natyam ad

కాంట్రాక్టు వాటర్ మాన్ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

కర్నూలు ముచ్చట్లు:

మంత్రి జయరామ్ సెగ్మెంట్ హలహర్వి మండలం అమృతపురం గ్రామంలో వాటర్ మాన్ కాంట్రాక్ట్ కార్మికుడు పరుశురాం సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసిన వైనం కలకలం రేపింది. వైయస్సార్ నాయకులు శేఖర్, దిబ్బలింగ కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి నా ఉద్యోగము తీసేసారని, అలాగే నా భార్య అంగన్వాడి ఆయాను కూడా అధికారలపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగాన్ని తొలగించాలని ప్రయత్నిస్తారని, గత వారం రోజులుగా నేను మనోవేదన గురి అయనంటూ పురుగులు మందు తాగాడు.
తినడానికి తిండి లేక భార్య పిల్లల్ని ఎలా పోషించాలని, చావే శరణమని,  గుమ్మునూరు నారాయణ, దిబ్బిలింగ అన్న నా చావుకు మీరే కారణం అవుతారని నేను అనుకోలేదని ఆవేద.పడుతూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. స్థానికులు గమనించి బళ్లారి హాస్పిటల్ కు తరలించారు.

Post Midle

Tags: A contract waterman worker commits suicide

Post Midle