Natyam ad

నవంబరు 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న జీ ఏ2  మరో బ్లాక్ బస్టర్  పొలిటికల్ థ్రిల్లర్  ’కోట బొమ్మాళి పీ ఎస్’

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

నవంబరు 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న జీ ఏ2 సంస్థ నిర్మించిన మరో బ్లాక్ బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ ’కోట బొమ్మాళి పీ ఎస్‘
తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ లనుఅందుకున్నారు.తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పీఎస్ ను నిర్మించింది జీఏ 2 సంస్థ. ఈ  సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.తేజ మార్నిదర్శకుడు.  శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు చక్కన స్పందన రాగా, ఇటీవల విడుదల చేసిన  లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని  కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారి  ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించింది చిత్రబందం. నవంబరు 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్.  ఈ సందర్భంగా నేడు విడుదల తేది పోస్టర్ నువిడుదల  చేశారు. ఇప్పటికే విడుదల చేసిన లింగిడి లింగిడి మాస్ జానపదం పాటతో అందరిలో సినిమాపై అంచనాలు పెరిగాయి. పోలీస్ కు రాజకీయనాయకుడికి  మధ్య జరిగే  పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతొో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. , జోహర్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న  తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు

 

Tags: Another Block Buster Political Thriller ‘Kota Bommali PS’ is GA2 which will release worldwide on November 24.

Post Midle
Post Midle