Natyam ad

సాధనతో ఏదైనా సాధ్యమే-ఆచార్య ఎన్‌.ఈశ్వరరెడ్డి

కడప ముచ్చట్లు:

ప్రతి విద్యార్థినీ వేధించే సమస్య ధారణ అని, గుర్తుండని అంశాలను విద్యార్థులు పలుమార్లు రాస్తూ ఏకాగ్రతతో సాధన చేయాలని, అలా సాధన చేస్తే ధారణాశక్తి పెరుగుతుందని యోగి వేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్‌.ఈశ్వరరెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ‘తెలుగు సూర్యుడు’ సి.పి.బ్రౌన్‌ 139వ వర్ధంతిని (డిసెంబర్‌ 12) పురస్కరించుకొని ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు బ్రౌన్‌ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగా నాల్గవరోజు శుక్రవారం ఉదయం 8,9,10 తరగతుల విద్యార్థులకు హిందూ, ఇస్లాం, క్రైస్తవ గ్రంథాలలోని విషయాల గురించి ‘ధారణ పరీక్ష’ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైవీయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్‌.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ధారణ ఎలా సాధ్యపడుతుందో ఉదాహరణ పూర్వకంగా తెలియజేశారు.

 

 

ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా అధికారి ఒక కుగ్రామంలో పుట్టి అందరి విద్యార్థుల్లాగానే గుర్తు పెట్టుకోవడంలో చాలా ఇబ్బంది పడిరదని, తండ్రి ప్రోత్సాహంతో, సాధనతో జ్ఞాపకశక్తిని వృద్ధి చేసుకొని నేడు ఉన్నతస్థాయిలో ఉన్న విషయాన్ని తెలిపి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. సభాధ్యక్షులు, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ హిందూ, ఇస్లాం, క్రైస్తవ గ్రంథాలలో సమకాలీన సమాజానికి  ఉపయోగపడే అనేక అంశాలు ఉన్నాయని, విద్యార్థులు వాటి పైన అవగాహన కలిగి ఉండడం అవసరమన్నారు. ధారణ అనేది విద్యార్థి మేథాశక్తి స్థాయిని నిర్ణయిస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వైయస్సార్‌ కడప జిల్లాకు చెందిన లక్కోజు సంజీవరాయ శర్మ పుట్టుకతో అంధుడైనా ధారణాశక్తితో గణితావధానిగా దేశమంతటా కొనియాడబ డ్డారన్నారు. విశిష్ట అతిథి, నాబార్డ్‌ మేనేజర్‌ డి.విజయ విహారి మాట్లాడుతూ తినే ఆహారాన్ని బట్టి కూడా ధారణాశక్తి వృద్ధి పొందుతుందని, కాబట్టి విద్యార్థులు సాధ్యమైనంత మేరకు ఇంట్లో వండిన పదార్థాలను తినాలని సూచించారు. టివిలు, సినిమాలు అతిగా చూడడం వల్ల ధారణాశక్తి తగ్గుతుందని, సెల్‌ఫోన్లు విపరీతంగా వాడడం వల్ల సాటి మనుషులతో కమ్యూనికేషన్‌ లేకుండా పోతుందని తెలిపారు. మరో విశిష్ట అతిథి, సర్వశిక్షాభియా న్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ అంబవరం ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఆటలు బాగా ఆడుకోవాలని, దాని వల్ల శరీర ఆరోగ్యంతో పాటు ఉత్సాహం పెంపొంది అనేక విషయాలను అవగాహన చేసుకోగలుగుతార న్నారు.

 

 

 

Post Midle

కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే ఏదైనా గుర్తుంటుంద న్నారు. గౌరవ అతిథి, విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం అధ్యాపకులు ఆచార్య కె.రఘుబాబు మాట్లాడుతూ విద్యార్థులు చదివే విషయాన్ని ఊహాశక్తితో దృశ్యరూపంలో ఒక ఉదాహరణతో భావనచేస్తే ఆ విషయం సులభంగా అర్థం కావడంతోపాటు బాగా గుర్తుంటుందన్నారు. మరో గౌరవ అతిథి, విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా ఆర్‌.వి.జయంత్‌ కశ్యప్‌ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్ళడం అలవాటు చేసుకొని, అక్కడి అనేక పుస్తకాలను చదవాలని, అప్పుడే వ్యక్తిత్వం రాటుతేలుతుందన్నారు. అంధుడైన ప్రసిద్ధ ఆంగ్లకవి జాన్‌ మిల్టన్‌ ధారణాశక్తిని, చిన్నవయసులోనే మరణించిన ప్రసిద్ధ ఆంగ్లకవయిత్రి తోరుదత్‌ ధారణాశక్తిని సోదాహరణంగా వివరించారు. మరో గౌరవ అతిథి, విశ్వవిద్యాలయం మెటీరియల్‌ సైన్స్‌ మరియు నానో టెక్నాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా  బి.విజయకుమార్‌ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు ధారణ చాలా ముఖ్యమైందని, ప్రతి అంశంలోనూ ధారణను జీవితంలో అన్వయించుకోవాలన్నారు. విద్యతోపాటు తల్లిదండ్రులను, గురువులను గౌరవించడం వంటి మంచి లక్షణాలు అలవరచుకు న్నప్పుడే జీవితంలో రాణించగలు గుతారన్నారు. అనంతరం 8,9,10 తరగతుల విద్యార్థులకు హిందూ, ఇస్లాం, క్రైస్తవ గ్రంథాలలోని విషయాల గురించి ‘ధారణ పరీక్ష’ నిర్వహింపబడిరది. ధారణ పరీక్షకు న్యాయనిర్ణేతలుగా సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా  భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, గ్రంథపాలకులు ఎన్‌.రమేశ్‌రావు, జి.హరిభూషణరావు వ్యవహరించారు.

 

Tags: Anything is possible with practice – Acharya N. Iswara Reddy

Post Midle