10 సంవత్సరాలు గా రక్షణ స్వచ్చంద సేవా సంస్థ సేవలు
అధ్యక్షులు పల్లెకొండు సంపత్ కుమార్
కడప ముచ్చట్లు:
గత 2013 ఆగస్ట్ 26 న విశ్వమాత సేవా మూర్తి మదర్ థెరిస్సా జన్మదినాన పదిమందికి సేవ చేయాలనే తలంపుతో పల్లెకొండు సంపత్ కుమార్ రక్షణ స్వచ్చంద సంస్థ స్థాపించారు తాను ప్రయివేట్ జూనియర్ కళాశాల లో పనిచేస్తున్నారు కళాశాల వారు ఇచ్చే జీతం తో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేకమంది ఆకలి తీరిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ సేవా కార్యక్రమాలు చూసి తర్వాత తన తండ్రి పల్లెకొండు ఏసురత్నం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, వారి మామ జలతోటి చంద్రపాల్,ప్రసాద్ బాబు లైఫ్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు వారి చిన్ననా జగన్మోహన్ రావ్ సోసియల్ వెల్ఫేర్ వార్డెన్ , లు వారి జీతం.లో 5 శాతం రక్షణ కార్యక్రమంలకు ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చారు. దానితో 2013 నుండి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు పాటు రక్షణ స్వచ్చంద సంస్థ ద్వారా 8 సార్లు రక్తదాన శిబిరాలు 11 సార్లు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనేకమండికి ఉచిత మందులు పంపిణీ చేశారు ఆపదలో ఉన్న వారికి తాను 19 సార్లు రక్త దానం చేయడమే కాకుండా అనేకమంది తో రక్త దానం చేయించి ఆపదలో ఉన్న గర్భిణీ స్త్రీలకు, అవసరం ఉన్న వారికి రక్తం అందించి సహాయ పడ్డారు అలాగే ప్రతి శుక్రవారం రోడ్ల పై నిరాశ్రయులకు యచకులకు భోజనం, అల్ఫాహారం పంపిణీ క్రమం తప్పకుండా చేసేవారు. అలాగే కడప నగరంలో ఉన్న అనాధ ఆశ్రమాలు, నిరాశ్రయుల వసతి గృహాలలో నాయకులు ప్రముఖులు కుటుంబ సభ్యుల జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ బట్టల పంపిణీ భోజనాల పంపిణీ చేపట్టేవారు.
అలాగే ఆత్మహత్య లు నివారించేందుకు కడప జిల్లాలోని అన్ని డిగ్రీ ఇంటర్ కళాశాలలో ఆత్మహత్య ల నివారణ కర పత్రాల పంపిణీ చేసి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఇప్పటికి 30 వేల కరపత్రాలు పంపిణీ చేసి అనేకమంది ని ఒత్తిడికి దూరం చేసి జీవితం పై భరోసా కల్పించారు.కరోన కష్ట కాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ భోజనాల పంపిణీ, వేసవి కాలంలో చాలివేంద్రాల ఏర్పాట్లు, మజ్జిగ పంపిణీ, ప్రభుత్వ పథకాల పై, రక్త దానం పై అవగాహన కల్పిస్తూ నిరుపేదలకు వారి కాళ్లపై వారు నిలబడేలా కుట్టుమిషన్ లు తీయించి వారితో చిరు వ్యాపారులు ప్రారంభించారు .రక్షణ ఆధ్వర్యంలో ఇప్పటికి 4 రు పేద పిల్లలకు ప్రైవేట్ స్కూల్ లలో చదువులు చెప్పిస్తున్నారు పై కార్యక్రమాలకు ఎవరి వద్ద కూడా ఇప్పటి వరకు ఎటువంటి డోనేషన్ లు తీసుకోకుండా తాను తన కుటుంబసభ్యుల సహకారం తో ఒక వ్యవస్థ నే నడుపుతూ సమాజ సేవలో 10 సంవత్సరాలు ముందుకు సాగారు.ఈ సేవా కార్యక్రమాలలో తనకు తోడుకు తన మిత్రులు, విద్యార్థులు ఎంతో సహకారాన్ని అందింస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని సంపత్ కుమార్ తెలిపారు.

Tags: Defense Voluntary Service Organization services for 10 years
