Natyam ad

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన జేఈవో   సదా భార్గవి

– అధికారులకు పలుసూచనలు

తిరుమల ముచ్చట్లు:

జనవరి 2నుండి 11వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రాలను టీటీడీ జేఈవో  సదా భార్గవి గురువారం పరిశీలించారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ ,విష్ణు నివాసం ,గోవిందరాజు స్వామి సత్రాలు,శ్రీనివాసం ,ఇందిర మైదానం ,జీవకోన జిల్లా పరిషత్
హై స్కూల్ , బైరాగి పట్టెడ రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ ,ఎంఆర్ పల్లి జడ్పీ హైస్కూల్ , రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ కౌంటర్లను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు టిఫిన్ అన్న ప్రసాదం పాలు టి తాగునీరు సరఫరా చేయడానికి ముందస్తు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసుల సహకారంతో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తగినంత భద్రత ఏర్పాటు చేసుకోవాలని వీజీవోను ఆదేశించారు.

 

 

Post Midle

టోకెన్ల జారీ కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఐటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ,తగినంతమంది సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్   నాగేశ్వరరావు ,విజిఓ శ్రీ మనోహర్ , శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి,ఈ ఈ   కృష్ణారెడ్డి, డిప్యూటీవో   గోవిందరాజన్ తో పాటు పలువురు అధికారులు జేఈఓ వెంట ఉన్నారు. అనంతరం శ్వేత భవనంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి వివిధ శాఖల అధికారులతో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కౌంటర్ కు ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పది రోజుల కోటా పూర్తి అయ్యేంతవరకు నిరంతరాయంగా టోకెన్లు జారీ చేస్తారని ఆమె వివరించారు. అన్ని విభాగాల అధికారులు, కౌంటర్ల వద్ద విధులకు నియమించిన సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆమె సూచించారు.

 

Tags: JEO Sada Bhargavi inspected Vaikuntha Dwara Darshan Token Issuing Centers.

Post Midle