Natyam ad

గడప గడపకు మన ప్రభుత్వం లో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టరు సుధాకర్

కర్నూలు ముచ్చట్లు:

కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు  డాక్టర్ జరదొడ్డి సుధాకర్ కోడుమూరు మండలం ముడుమలకుర్తి గ్రామంలో “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముడుమలగుత్తి గ్రామానికి చేరుకున్న కోడుమూరు ఎమ్మెల్యే కి స్థానిక గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే స్థానిక గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్స్ తో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగనన్న వారికి వివిధ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూర్చింది ఎంత లబ్ధి పొందింది వారికి వివరంగా వివరిస్తూ ఇంకా వారికి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని దానికి సంబంధించిన అధికారితో సమన్వయం చేసుకొని ఆ సమస్యకు పరిష్కారం మార్గాన్ని చూపుతూ ముందుకు సాగారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేష్ బోయ మధు ప్రహల్లాత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అయ్యస్వాములు మద్దిలేటి సిద్దన్న రాజు లాయర్ ప్రభాకర్ అయ్యప్ప మండల కన్వీనర్ మధుమోహన్ రెడ్డి వైసిపి నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Kodumuru MLA Doctor Sudhakar in our government

Post Midle