Natyam ad

మైనార్టీ సంక్షేమానికి పెద్ద పీట సియం వైఎస్ జగన్ చిత్ర పటానికి పాస్టర్ల పాలాభిషేకం

కడప ముచ్చట్లు:


రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 5196 మంది పాస్టర్లకు రూ. 2 కోట్ల, 59 లక్షల, 80 వేలు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు యస్ బి అంజాద్ బాషా అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో క్రిస్టియన్ మైనారిటీ కి సంబంధించి పాస్టర్లకు గౌరవ వేతనం రూ. 2 కోట్ల, 59 లక్షల, 80 వేలు మంజూరు చేయడం పట్ల జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సభ్యులు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ బి అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. అందుకు నిదర్శనంగా ప్రభుత్వ ఉత్తర్వు ఆర్.టి. నెం. 135, తేదీ 10-8-2022 ప్రకారం రూ. 2 కోట్ల, 78 లక్షల, 40 వేలు పాస్టర్ ల గౌరవ వేతనాన్నీ నిధులు కేటాయించినట్లు తెలిపారు.

 

 

అలాగే ఈ నిధులు 2022 ఆగస్టు మాసం నుండి 2023 మాసం వరకు  5196 మంది పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం పాస్టర్ ల గౌరవ వేతనం కింద రూ. 2 కోట్ల, 59 లక్షల, 80 వేలు మంజూరు చేసి విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.అలాగే  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి  ఎస్ బి అంజాద్బాష కు క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ సంఘం సభ్యులు ఇంత పెద్ద ఎత్తున పాస్టర్లకు గౌరవ వేతనం అందేదుకు కృషి చేసినందుకు కృతజ్ఞతాభివందనాలు తెలిపి, స్వీట్స్ ను తినిపించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మస్తాన్ వలీ, వైసిపి నాయకులు అహ్మద్ భాషా, ఇతర వైసీపీ నాయకులు, క్రిస్టియన్ మైనారిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Palabhishekam of the image of Siyam YS Jagan, the leader of minority welfare

Post Midle