Natyam ad

ప్రధాని మోదీ ప్రచారానికి వచ్చిన మాకు డోకా లేదు – మంత్రి పెద్దిరెడ్డి 

– నమ్మకద్రోహి కిరణ్‌కు ఓటమి తప్పదు

– రౌడీయిజం చేసే చల్లాబాబుకు మద్దతు ఇవ్వకండి

-సీఎం జగన్‌ వైపే జనం

Post Midle

పుంగనూరు ముచ్చట్లు:

రాజంపేట పార్లమెంటు ఎన్నిక ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీని తీసుకొస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచారం చేస్తున్నాడని , ప్రధాని వచ్చిన మాకు డోకాలేదని , ఎంపీగా మిధున్‌రెడ్డి మీ అందరి సహకారంతో అఖండ విజయం సాధిస్తారని రాష్ట్ర మంత్రి , ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని పలు కుల సంఘాల సమావేశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ బిజెపి తరపున పోటీ చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్నారని తెలిపారు. మంచినీటి ప్రాజెక్టుల కోసం మనమంతా కలిసి 77 కిలో మీటర్ల పాద యాత్ర చేశాం గుర్తు చేసుకోవాలన్నారు. సీఎం పదవి కోసం అందరి కాళ్ళు పట్టుకుని సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టించాడని , రాష్ట్ర విభజనలో ఆంధ్ర  రాష్ట్రానికి ద్రోహం చేసి , కాంగ్రెస్‌ పార్టీకి కూడ వెన్నుపోటు పొడిచిన నమ్మకద్రోహి కిరణ్‌ అని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు ఓట్లు వేస్తే మనకు వెన్నుపోట్లు తప్పదన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చల్లారామచంద్రారెడ్డి చంద్రబాబు పర్యటనను రాజకీయం చేసి లబ్ధిపొందాలన్న దురుద్దేశంతో పోలీసులపై దాడులు చేశారని తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 50 మంది పోలీసులు గాయపడగా, ఒక పోలీస్‌ కన్ను కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వారికి ఓట్లు వేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థుల చరిత్ర రౌడీయిజం, వెన్నుపోట్లు, నమ్మకద్రోహమేనని ఎద్దెవ చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన ప్రజలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైపు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రెండువ సారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: We have no doka for PM Modi’s campaign – Minister Peddireddy

Post Midle