Natyam ad

13 సంవత్సరాలు భార్యను గదిలో నిర్బంధించిన న్యాయవాది

విజయనగరం ముచ్చట్లు:

ఆ న్యాయవాది ఆ న్యాయవాద  వృత్తికే కళంకం తెచ్చాడు. తన తల్లి, సోదరుడు మాటలు విని ఏకంగా 13 సంవత్సరాల పాటు తాళి కట్టిన భార్యను ఇంట్లో బంధించి బయట ప్రపంచానికి దూరం చేశాడు. చీకటి గదిలో బక్క చిక్కిన శరీరంతో 13 ఏళ్ల పాటు కఠినాతి కఠినమైన జీవితాన్ని ఆమె అనుభవించింది. బయట ప్రపంచానికి ఆమెను దూరం చేసాడు. గోదావరి మధుసూదన్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియ ను విజయనగరంలోని కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్ 2008లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కలిగిన అనంతరం న్యాయవాది మధుసూదన్ తన తల్లి గోదావరి ఉమామహేశ్వరి తో పాటు తన తమ్ముడు మాటలు విని కట్టుకున్న భార్యను వేధించాడు. బయట ప్రపంచానికి దూరం చేస్తూ చీకటి గదిలో 13 సంవత్సరాలు పాటు బంధించాడు. బాధితురాలు కుటుంబ సభ్యులు ఎన్ని మార్లు అడిగినప్పటికీ బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించేవాడు.

 

 

 

సహనం కోల్పోయిన బాధితురాలి తల్లిదండ్రులు ఇటీవల జిల్లా ఎస్పికి ఫిర్యాదు చేయడంతో ఒకటవ పట్టణ పోలీసులు గతనెల 28 మధుసూదన్ ఇంటికి వెళ్లి పరిశీలించారు. తమ ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదని, తనిఖీ చేసేందుకు కోర్టు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అంటూ మధుసూదన్ పోలీసులను ప్రశ్నించి అడ్డుకున్నాడు. దాంతో బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్ తీసుకువచ్చారు. దీంతో బుధవారం పోలీసులు న్యాయవాది మధుసూదన్ ఇంటిని తనిఖీ చేయగా సాయి ప్రియ బక్క చిక్కిన శరీరంతో చీకటి గదిలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఓ మూలన కనిపించింది. దీంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకువచ్చి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.

 

Post Midle

Tags; A lawyer who confined his wife to a room for 13 years

Post Midle