శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
కర్నూలు ముచ్చట్లు:
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. కార్తీక చివరి సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారు జామున నుంచే పాతాళ గంగలో స్థానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం బారులు తీరారు. స్వామి వారి ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడింది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. కార్తీక మాసం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్వామి వారి స్పర్శ దర్శనాలు రద్దు చేసారు. గర్భాలయం 5 వేల రూపాయల అభిషేకాలు రద్దు చేసారు. 1500 రూపాయల సామూహిక అభిషేకం చేసుకున్న వారికి కూడా అలంకార దర్శనం మాత్రమే అనుమతించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే కుంకుమార్చనలు, ఆశీర్వచన మండపంలో మాత్రమే నిర్వహించారు.
Tags: Devotees flock to Srisailam

