Natyam ad

సరికొత్త క్యాంపెయిన్ తో జనసేనాని

విజయవాడ ముచ్చట్లు:

గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్ లో ఎక్కడికక్కడ రోడ్లను ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు జనసేన శ్రేణులు. ఈ నేపథ్యంలో గుంతలు పడి దెబ్బతిన్న రోడ్ల లో జనసేన నాయకులు వినూత్న రీతిలో పూల మొక్కలు నాటారు.ఆంధ్రప్రదేశ్ లోని(Andhrapradesh) రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేసే విధమా జనసేన పార్టీ (Janasena party) సరికొత్త క్యాంపెయిన్ ను మొదలు పెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నెతలు, కార్యకర్తలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా రహదారి మధ్యలో పూల మొక్కలు వెలిశాయి. తమ ప్రాంతంలోని రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ జనసేన చేపట్టిన #గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్ లో ఎక్కడికక్కడ రోడ్లను ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు జనసేన శ్రేణులు. ఈ నేపథ్యంలో విజయవాడ భవానిపురం లోని ఊర్మిళ నగర్ లో గుంతలు పడి దెబ్బతిన్న రోడ్ల లో జనసేన నాయకులు వినూత్న రీతిలో పూల మొక్కలు నాటారు. రోడ్ల పరిస్థితిని వీడియో తీసి.. పూల మొక్కలు నాటి వినూత్నంగా డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.

 

 

Post Midle

జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్.#GoodMorningCMSir విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43 వ డివిజన్ ఊర్మిళ నగర్ లో @ysjagan గారు@PawanKalyan@JanaSenaParty @JSPShatagniTeam pic.twitter.com/uKPzjoB6QAఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. రోడ్ల మరమత్తులు కై 2వేల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్యం ఆ డబ్బును ఏమి చేసిందని ప్రశ్నించారు.  జూలై 15 నాటికి రోడ్లన్నీ బాగుచేస్తం అన్న మాటలు ఏమయ్యాయన్నారు.. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రోడ్లని బాగు చేసేవరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు మహేష్.మరోవైపు జనసేన పార్టీ శ్రేణులు..  ఆచంట నియోజకవర్గం రామన్నపాలెం గ్రామంలో రోడ్లపై ఇటీవల కురిసిన వర్షాలతో.. గుంతలు పూర్తిగా నీరుతో నిండిపోయాయి. దీంతో కొంతమంది వ్యక్తులు రోడ్డుమీద వరి నాట్లు వేస్తూ.. పంట చేలుగా మారిన తమ రోడ్డు దుస్థితిపై నిరసన వ్యక్తం చేశారు.
ఆచంట నియోజకవర్గం రామన్నపాలెం గ్రామంలో రోడ్లు పంట చేలుగా మారిన దుస్థితి.

 

Tags: Janasena with a new campaign

Post Midle