భారత దేశ ఘన కీర్తి చాటుకుందాం
75 ఏళ్ల స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుందాం…
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగర వేద్దాం ..
బిజెపి లీగల్ సెల్ కరీంనగర్ జిల్లా నేత కటకం శ్రవణ్ కుమార్
కరీంనగర్ ముచ్చట్లు:
.
భారతదేశ ఘన కీర్తిని చాటుకోవడానికి 75 ఏళ్ల స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బిజెపి లీగల్ సెల్ కరీంనగర్ జిల్లా నేత కటకం శ్రవణ్ కుమార్ తెలిపారు . ఆజాధి కా అమృత్ మహోత్సవ్ అభియాన్ లో భాగంగా బిజెపి లీగల్ సెల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్లోని కోర్టు ప్రాంగణంలో తిరంగా మహోత్సవ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ, ఆజాది క అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా పండుగ మహోత్సవ కార్యక్రమం దేశవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు. అందులో భాగంగానే బిజెపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో తిరంగా పండగమహోత్సవ కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు . ముఖ్యంగాదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాల పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా దేశభక్తిని

గడప గడపకూ, వాడవాడలా తెలియజేసేలా ఈనెల 13 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవలసిన బాధ్యత దేశభక్తులందరిపై ఉందని చెప్పారు . భారతావని ఘనకీర్తిని చాటడానికి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి , 75 ఏళ్లస్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా కో-కన్వీనర్ కొలిపాక చంద్రమౌళి, న్యాయవాదులు కోమల ఆంజనేయులు, బాస సత్యనారాయణ, కిరణ్ సింగ్, గుజ్జ సతీష్, బేతి మహేందర్, బల్బీర్ సింగ్, కృష్ణార్జున చారి, రాజ్ కుమార్ గుప్తా, శ్రీనివాస్ గౌడ్, మునీష్, మసర్తి భాస్కర్, వెన్న ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Let’s spread the great glory of India
