ముడసర్లోవ భూముల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు
-భారీగా తరలివచ్చిన వామపక్ష నేతలు
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో ప్రసిద్ది చెందిన ముడసర్లోవ భూముల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు వెళ్లువెత్తాయి. భూములను పిపిపి విదానంలో ప్రైవేట్ వారికి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ముడసరలోవ పార్క్ మెయిన్ గేట్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.నిరసన లో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జి ప్రభుత్వ తీరుపై ఎండగట్టారు.అనంతరం వాటర్ బాడీ స్ ని పరిశీలించిన టీడీపీ నేతలు … ముడసరలోవ భూములు చాలా విలు వైనవి అని,విశాఖ ప్రజల దాహార్తిని తీరుస్తుందని చెప్పారు.ప్రజలకు ఉపయోగపడే ముడసరలోవ పార్క్ ని ప్రయివేట్ పరం చేయడం దారుణ మని అన్నారు.ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మరోవైపు సిపిఎం నేతలు కూడా జీవిఎంసీ పాలన వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తారు.వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: Protests against privatization of Mudasarlova lands
