Natyam ad

అన్నప్రసాదాల తయారీకి మిల్లర్ల నుంచి బియ్యం సేకరించే ఆలోచన

-డయల్‌ యువర్‌ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

 

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమలలోని మాతృశ్రీ  వెంగమాంబ భవనంలో భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యత మరింత పెంచడానికి గతంలో లాగే మిల్లర్ల నుంచి బియ్యం సేకరించాలని ఆలోచిస్తున్నామని టీటీడీ ఈవో    ఎవి ధర్మారెడ్డి చెప్పారు.  ప్రస్తుతం టెండర్ల ద్వారా బియ్యం సేకరిస్తున్నామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులతోను, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవి.

 

Post Midle

తిరుమలలో వేసవి ఏర్పాట్లు  :

 

– వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాం.

– ఏప్రిల్‌ 15 నుండి జూలై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300/` దర్శన టికెట్లను టిటిడి బోర్డు తగ్గించింది. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది.

– తిరుమలలో దాదాపు 7400 గదులు, 4 పిఏసిలు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నాం.

– తిరుమలలో ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకున్న వారు స్వయంగా వచ్చి ఏఆర్‌పి కౌంటర్‌లో స్కానింగ్‌ చేసుకోవాలి. వారికి గది కేటాయించినట్టుగా మెసేజ్‌ వచ్చిన తర్వాత సంబంధిత సబ్‌ ఆఫీసుకు వెళ్లి గదులు పొందాలి. ఇతరులు ఎవరు వచ్చినా గదులు పొందలేరు.

– నిర్ణీత సమయం(రెండు గంటల) లోపు సంబంధిత భక్తుడు గది తీసుకోకపోతే కాలపరిమితి ముగుస్తుంది. గదికి చెల్లించిన అద్దె తిరిగి ఇవ్వబడదు. కాషన్‌ డిపాజిట్‌ మాత్రమే తిరిగి చెల్లించడం జరుగుతుంది.

– గదుల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలను దృష్టిలో ఉంచుకుని,  మధ్యవర్తులను, దళారీలను కట్టడి చేసి భక్తులకు గదులు అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ప్రవేశపెట్టడం జరిగింది.

– భక్తులు గదులు పొందే సమయంలో వారి ఫొటోను పొందుపరుచుకొని, తిరిగి గది ఖాళీ చేసే సమయంలో ఆ ఫొటోను సరిచూసుకొని మాత్రమే కాషన్‌ డిపాజిట్‌ ఇవ్వడం జరుగుతుంది.

– ఈ విధానం వల్ల గదులు త్వరగా ఖాళీ అవడమే గాక, భక్తులకు గతంలో కంటే మరిన్ని ఎక్కువ గదులు కేటాయించే అవకాశం కలుగుతోంది.

– క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నాం.

 

– ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు వేశాం. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేశాం.

– మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పాత అన్నదానం కాంప్లెక్స్‌తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాల్లో అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తాం.

– అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జలప్రసాద కేంద్రాల ద్వారా భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచుతాం. మరింత మెరుగ్గా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేస్తున్నాం.

– ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో నిరంతరాయంగా భక్తులకు  సేవలందించేందుకు ఏర్పాట్లు చేశాం.

– భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకున్నాం.

– టిటిడి విజిలెన్స్‌, పోలీసుల సమన్వయంతో భక్తులకు పార్కింగ్‌ సౌకర్యం కల్పించడంతో పాటు ట్రాఫిక్‌ సమస్య లేకుండా చర్యలు చేపట్టాం.

– భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి సేవలందించేందుకు దాదాపు 2,500 మంది శ్రీవారి సేవకుల సేవలను వినియోగిస్తున్నాం.

– కరోనా కారణంగా 3 సంవత్సరాల తరువాత భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా అలిపిరి మార్గంలో గాలి గోపురం వద్ద 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 1250వ మెట్టు వద్ద 5 వేల దివ్యదర్శనం టోకెన్లు కేటాయిస్తున్నాం. భక్తులు తమ ఆధార్‌ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది.

– తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉచితంగా రవాణా చేసేందుకు దాత ద్వారా 10 నూతన విద్యుత్‌ ధర్మరథాలను మార్చి 27వ తేదీన తీసుకున్నాం. ఏప్రిల్‌ 15వ తేదీ తరువాత డీజిల్‌ బస్సుల స్థానంలో ఈ బస్సులు భక్తులకు అందుబాటులోకి వస్తాయి.

– తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ఏప్రిల్‌ 29 నుండి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం.

 

అగరబత్తులు :

– టిటిడి ఆలయాల్లో వినియోగించిన పూలతో తయారుచేస్తున్న అగరబత్తీలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రోజుకు 15 వేల ప్యాకెట్లు తయారవుతుండగా, భక్తుల డిమాండ్‌కు ఇవి సరిపోవడం లేదు. దీంతో రెండవ యూనిట్‌ ఏర్పాటుచేసి మార్చి 31న ప్రారంభించాం. దీనివల్ల రోజుకు 30 వేల ప్యాకెట్లు తయారుచేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నాం.

 

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు :

– మార్చి 31వ తేదీ ప్రారంభమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

– ఏప్రిల్‌ 5వ తేదీన శ్రీకోదండరామస్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించాం.

 

ఇతర ఆలయాల్లో…

– మే 2 నుండి 5వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం.

వ మార్చి 17వ తేదీ చెన్నై నగరంలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించి, భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం.

 

విద్యాసంస్థలు

 

– తిరుపతి ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కాలేజికి తొలి ప్రయత్నంలోనే న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ లభించింది.

– ఏడాది కాలంలోనే టీటీడీలోని అన్ని కళాశాలలకు న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ రావడానికి కృషి చేసిన జేఈవో  శ్రీమతి సదా భార్గవి, డిఈవో, కళాశాలల ప్రిన్సిపాళ్ళు, సిబ్బందిని అభినందిస్తున్నాను.

 

మార్చి నెలలో నమోదైన వివరాలు :

 

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య- 20.57 లక్షలు.

హుండీ :

– హుండీ కానుకలు – రూ.120.29 కోట్లు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1.02 కోట్లు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 38.17 లక్షలు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 8.25 లక్షలు.

 

ఈ కార్యక్రమంలో జెఈవోలు   సదా భార్గవి,   వీరబ్రహ్మం, చీఫ్‌ ఇంజినీర్‌   నాగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Tags: The idea is to collect rice from millers for making Annaprasad

Post Midle