వైన్స్ షాపును లూటీ చేసిన దొంగలు
నల్గోండ ముచ్చట్లు:
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామ శివారులోని శివ సాయి వెంకటేశ్వర వైన్స్ లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో సుత్తితో పై కప్పు రేకులను పగలగొట్టి తాడు సహాయంతో లోపలికి దిగి 1,96,000 రూపాయల విలువగల మద్యం బాటిల్లను 30,000 నగదును దోచుకెళ్ళారు. రోజు మాదిరిగానే రాత్రి పది గంటలకు షాపును మూసివేసి గుమస్తా ఇంటికి వెళ్ళాడని మరుసటి రోజు ఉదయం షాపు వద్దకు రాగానే స్వెటర్ తాళాలు తీసి ఉన్నాయని వైన్ షాప్ యజమాని వెంకట్ రెడ్డి తెలిపారు. దొంగలు వైన్ షాప్ లో బీభత్సం సృష్టించారని రేకులను సీసీ కెమెరాల బాక్సులను ఫర్నిచర్ ను ధ్వంసం చేశారని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
Tags: Thieves looted a wine shop

