పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం టీటీడీ స్థానిక ఆలయాల మూత
తిరుపతి ముచ్చట్లు:
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం టీటీడీ స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి మరుసటిరోజైన ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు. అక్టోబరు 29న వేకువజామున 1.05 నుండి 2.22 గంటల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో శనివారం రాత్రి 7 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం 6.45 గంటలకు ఆలయ తలుపులు మూసి వేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

Tags:TTD local temples are closed in the evening due to partial lunar eclipse
