8న వైవీయూలో అధ్యాపకుల నియామకానికి వాకిన్ ఇంటర్వ్యూలు
కడప ముచ్చట్లు:
యోగి వేమన విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (పి.ఎస్.అండ్ పి.ఎ) విభాగంలో అకడమిక్ కన్సల్టెంట్స్ (అధ్యాపకుల) నియామకానికి ఆగస్టు 8వ తేదిన నేరుగా ముఖాముఖి (ఇంటర్వ్యూలు) నిర్వహించనున్నట్లు పీజీ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య కె.కృష్ణారెడ్డి తెలిపారు. అకడమిక్ కన్సల్టెంట్స్ ఒక పోస్టునకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఓసీ, ఓబీసీ అభ్యర్థులకు పీజీలో 55 శాతం మార్కులు ఉండాలని, ఎస్సీ ఎస్టీ వర్గాలకు 50 శాతం ఉన్నకూడా అర్హులన్నారు. పి హెచ్ డి, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు బయోడేటా ఒరిజినల్ సర్టిఫికెట్ లతో యోగి వేమన విశ్వవిద్యాల యంలోని ప్రధానాచా ర్యులు కార్యాలయంలో 8వ తేదీ ఉదయం10 గంటలకంతా హాజరు కావాలన్నారు.
Tags:Walk-in interviews for faculty recruitment in YVU on 8th

