Natyam ad

21 నుండి 23వ తేదీ వరకు దేశంలోని ప్ర‌ముఖు శిల్ప క‌ళాకారుల‌తో ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ శిల్పకళపై వర్క్ షాప్

తిరుపతి  ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో సెప్టెంబరు 21 నుంచి 23వ తేదీ వరకు సంప్రదాయ శిల్పకళ – అనుబంధ అంశాలపై దేశంలోని 12 మంది నిష్ణాతులతో వర్క్ షాప్ నిర్వహించనున్నారు.సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ వ‌ర్క్‌షాప్‌లో మొద‌టి రోజైన సెప్టెంబ‌రు 21న ఉదయం 10 గంటల నుండి 11:30 గంటల వరకు చెన్నైకి చెందిన స్థపతి
శ్రీ దక్షిణామూర్తి “శిల్పశాస్త్రాల ప్రకారం దక్షిణ భారతదేశంలో ఆలయాల నిర్మాణం” అనే అంశంపై , ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్ సిఈవో డాక్టర్ ఈ శివనాగిరెడ్డి “హిందూ ఆలయాల ప‌రిణామ‌క్ర‌మం” అనే అంశంపై ఉపన్యాసిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు తమిళనాడులోని కుంభకోణం స్వామిమ‌లైకి చెందిన స్థ‌ప‌తి శ్రీ దేవా రాధాకృష్ణ “లోహ శిల్పాల తయారీ విధానం, “, మధ్యాహ్నం 3:45 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు టీటీడీ ఆగ‌మ సలహాదారు
శ్రీ విష్ణుబ‌ట్టాచార్యులు ” విగ్రహప్రతిష్ట విధానం ” అనే అంశంపై మాట్లాడ‌తారు.

 

 

Post Midle

సెప్టెంబ‌రు 22న ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీ శేషబ్రహ్మం “సంప్రదాయ చిత్రకళలో మెళ‌కువలు “, ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ నాగేశ్వరరావు ” శిల్ప శాస్త్రాల్లో ప్రతిమా లక్షణాలు ” అనే అంశంపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు చెన్నైకి చెందిన విశ్రాంత స్థపతి శ్రీ సుందర్‌రాజన్ “ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆలయ నిర్మాణ మెళ‌కువ‌లు ” అనే అంశంపై ఉపన్యాసిస్తారు.సెప్టెంబ‌రు 23న ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు తిరుపతికి చెందిన   కిర‌ణ్‌క్రాంత్ చౌద‌రి “భార‌తీయ రేఖాచిత్రాల చ‌రిత్ర “, ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వ‌ర‌కు హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత స్థ‌ప‌తి డాక్టర్ వేలు ” దక్షిణ భారతదేశ ఆలయాల్లో ప్రసాదాల ప్రాముఖ్య‌త‌” ను వివ‌రిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు కోయంబత్తూరుకు చెందిన స్థ‌ప‌తి శ్రీ టి.సెల్వం ” సుధా శిల్పాల తయారీ విధానం “, టీటీడీ స్థ‌ప‌తి
మున‌స్వామిరెడ్డి “ఆలయాల నిర్మాణానికి ” సంబంధించిన అంశాల‌పై ప్ర‌సంగిస్తారు.శిల్ప కళాశాల ప్రిన్సిపాల్  కె.వెంక‌ట‌రెడ్డి ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

 

Tags: Workshop on traditional sculpture at SV Shilpa College with leading sculptors of the country from 21st to 23rd

Post Midle