ఆడపిల్ల పుట్టిందని బ్రతికుండగానే మట్టిలో పూడ్చేశారు 

హన్మకొండ ముచ్చట్లు:

 

హన్మకొండ జిల్లాలో అప్పుడే పుట్టిన ఆడశిశువును ప్రాణాలతో పాతిపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు.దామెర మండలంలోని ఊరుగొండ శివారులో రోడ్డుపక్కన ఆగిన ఓ లారీ డ్రైవర్ భూమిలో కదలికలు గుర్తించాడు.వెంటనే మట్టి తీసి చూడగా పసికందు కనిపించింది.వెంటనే పక్కనే ఉన్న ఉపాధి హామీ కూలీలను పిలవగా అందరూ కలిసి పాపను మట్టిలోనుండి బయటకు తీశారు.అక్కడకు చేరుకున్న ఎస్సై పసికందును ఎంజీఎం కు తరలించారు.అర్థగంటకు పైగా మట్టిలో పాతిపెట్టిన పాప ప్రాణాలతో ఉండడంతో అందరూ అవాక్కయ్యారు.ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు.

 

Tags:A girl child was born and buried in the soil as soon as she was alive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *