Natyam ad

మహబూబాబాద్ జిల్లాలో వింత వివాహం ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకున్న యువకుడు ట్రైన్ లో పరిచయం గుడిలో వివాహం సమాజంలో మమ్ముల్ని గుర్తించాలంటున్న ట్రాన్స్ జెండర్

మహబూబాబాద్ ముచ్చట్లు;


మహబూబాబాద్ జిల్లాలో వింత వివాహం ఆదర్శంగా జరిగింది. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ బానోత్ రాధిక (28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరు (30) ప్రేమించుకున్నారు. గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. బానోత్ రాధిక ట్రైన్ లో వీరు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2 సంవత్సరాలు ప్రేమించుకున్న వీరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో మమ్ముల్ని గుర్తించాలన్నారు. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని జరగాలని కోరుకున్నారు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కూడా కల్యాణ లక్ష్మి అందజేయాలని కోరారు. వివాహ తంతులో ట్రాన్స్ జెండర్ శోభ, రాధిక, దుర్గ, నందు, రవళి పాల్గొన్నారు.

Tags:A strange marriage in Mahbubabad district
A young man married to a transgender
Introduction in train, marriage in temple
Transgender wants to recognize us in the society

Post Midle
Post Midle