కరువు గురించి చర్చించని మంత్రివర్గం ఈ రాష్ట్రానికి అవసరమా?
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ కరువు గురించి చర్చించని మంత్రివర్గం ఈ రాష్ట్రానికి అవసరమా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో 400 పైచిలుకు మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉంటే, కేవలం 103 మండలాలతో సరిపెడతారా? గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వలసలు వెళ్తుంటే జగన్ సర్కార్ నిద్రపోతోందా? రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటే ముఖ్యమంత్రి, మంత్రులు చోద్యం చూస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం దుర్మార్గమని అయనఅన్నారు.
Tags: Does this state need a cabinet that does not discuss drought?
