Natyam ad

జోరుగా  వరి సాగు

మెదక్ ముచ్చట్లు:

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించడమే తమ లక్ష్యమని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గత రెండు సంవత్సరాల క్రితం కొండపోచమ్మ నుండి 32 చెక్ డ్యామ్ నిర్మించి గొలుసుకట్టు చెరువులు నిండేలా నీటిని విడుదల చేశారు దీంతో కాల్వలు, చెరువులు నిండు కుండల కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే పెరిగిన భూగర్భ జలాలు ఏళ్ల తరబడి బీళ్లు పడి, నెర్రలు బారిన భూములు ఇప్పుడు మడికట్టు బొర్లేలా నిండుకుండాలా నీళ్లతో పచ్చని వరి పైర్లతో ఊగే పొలాలు, ముళ్ళ కంపలు పిచ్చి మొక్కలతో నిడిపోయిన కాల్వల్లో చెరువులో అంతే మార్పు గలగలపారే నీటి సవ్వడిసమృద్ధిగా వర్షాలు పడితే గాని నిండుగా నీరు,కనిపించని పెద్ద చెరువు, హల్దీవాగు దశ దిశ మారింది కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి కాలువ ద్వారా 6.12 కిలోమీటర్ల వద్ద నుండి హల్దీ వాగులోకి గోదావరి జలాలు సీఎం కేసీఆర్ రెండు సంవత్సరాల క్రితం వదిలారు,

 

 

Post Midle

తొలుత ఈ కాలువ నుండి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులో నుంచి,అక్కడి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చేరువులైన వర్గల్ పెద్ద చెరువు, శాఖరం ధర్మయ్య చెరువు, అంబర్ పెట్ ఖాని చెరువు ఇలా నిండుతూ నాచారం మీదుగా హల్దీవాగులో చేరాయి.దీంతో మండలం లో గతంలో కంటే రెట్టింపు సాగు జరిగింది గతంలో వరిసాగు 8 వేల ఎకరాల్లో మాత్రమే పండేది, నేడు 13 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు,రెండుసార్లుగా నీటిని వదలడంతో భూగర్భ జలాలు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు రెండు సంవత్సరాల నుండి చెరువులన్నీ నిండుకుండాలా కనిపిస్తున్నాయి కొండపోచమ్మ ప్రాజెక్టు కారణంగా వర్గల్ మండలం ఇప్పుడు సస్యశ్యామల మవుతుంది.

 

Tags: Intensive rice cultivation

Post Midle