Natyam ad

స్వ‌ర్ణ‌ర‌థంపై మెరిసిన సిరుల‌త‌ల్లి

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం సాయంత్రం అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది.కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు విశేష స్వ‌ర్ణ‌, వ‌జ్రాభ‌ర‌ణాల‌ను ధ‌రించి భ‌క్తుల‌కు కనువిందు చేశారు. పెద్ద‌సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొని స్వ‌ర్ణ‌ర‌థాన్ని లాగారు.ఈ కార్య‌క్ర‌మంలో చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు  పోకల అశోక్ కుమార్,శ్రీ రాములు,
జేఈవో  వీరబ్రహ్మం దంపతులు విఎస్వోలు  బాల్ రెడ్డి,  మనోహర్, ఆలయ డెప్యూటీ ఈవో  లోకనాథం, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ‌నివాసాచార్యులు, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు
బాబు స్వామి, ఆర్జిత ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Mother of shining veins on a golden chariot

Post Midle