త్వరలో భారత్, పాక్ ప్రధానుల భేటీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారత్, పాకిస్థాన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక సమావేశమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ దాయాది దేశాల ప్రజలు ఎలా ఉన్నా రెండు దేశాల నాయకులు, రాజకీయాలు, రక్షణ వ్యవహారాల దృష్ట్యా తీవ్రమైన వైరం నెలకొని ఉంటుంది. అయితే, ఇరు దేశాల అగ్ర నాయకులు కలిస్తే మాత్రం ఆ వార్త ఇరు దేశాలకు ఎంతో కొంత మంచి జరుగుతుందని, జరగాలని అంతా ఆశిస్తుంటారు. ప్రస్తుతం మంచి సంగతి అలా ఉంచితే, ఇరు దేశ ప్రధానులూ కలిసి అరుదైన అవకాశం త్వరలో రానుంది. వచ్చే నెలలో ఉజ్బెకిస్థాన్‌లో భారత్, పాకిస్థాన్ ప్రధానులు సమావేశం కానున్నారు. దీనిపై ఇద్దరు ప్రధానులు – నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్‌లు సమావేశం కావచ్చని వార్తలు వచ్చాయి. SCO సెక్రటరీ జనరల్ జాంగ్ మింగ్ శుక్రవారం మూడు రోజుల పాటు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 15-16 తేదీల్లో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగే SCO వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనవలసిందిగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను జాంగ్ మింగ్ ఆహ్వానించనున్నారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నట్లు ఇప్పటికే ఖరారయ్యింది.అధికారికంగా వీరిద్దరి మీటింగ్ ప్రకటించకపోయినప్పటికీ, ఈ సందర్భం పాకిస్థాన్, భారత ప్రధానమంత్రులు ముఖాముఖికి వచ్చేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఇద్దరు ప్రధానులు ఒకే చోట ఉండడం, ఒకరినొకరు చూసుకునే అవకాశాన్ని పొందడం ఇదే తొలిసారి కావడంతో ఆరేళ్ల తర్వాత ఈ తొలి మీటింగ్ చర్చలకు అవకాశం కల్పించవచ్చని ది న్యూస్ నివేదించింది. ఇక, షెహబాజ్, మోడీలు రెండు రోజుల పాటు ఒకే సమ్మేళనంలో ఉండే అవకాశం ఉండటంతో వారి మధ్య చర్చను తోసిపుచ్చలేమని ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు గురువారం భారతదేశ మీడియాకు తెలిపాయి. “భారతదేశం ఇంకా అభ్యర్థించలేదు గనుక ఇద్దరి నిర్మాణాత్మక సమావేశం ముడిపడి లేదు. ఒకవేళ అలాంటి అభ్యర్థన చేస్తే, పాకిస్తాన్ ప్రతిస్పందన తప్పనిసరిగా సానుకూలంగా ఉంటుంది” అని ఆ వర్గాలు వెల్లడించాయి.చైనా, పాకిస్తాన్, రష్యా, భారతదేశం, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, కజకిస్తాన్ ఈ సమూహంలో పూర్తి సభ్యులు కాగా, ఈ గ్రూప్ కొత్త చైర్‌పర్సన్ ఇప్పటికే దాని ప్రాధాన్యతలు, విధులను వివరించింది. ఈ ఆర్గనైజేషన్ సామర్థ్యాన్ని, అధికారాన్ని పెంపొందించడంతో పాటు, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, పేదరికాన్ని తగ్గించడానికి, ఆహార భద్రతకు హామీ ఇచ్చే ప్రయత్నాలు ఇందులో ఉన్నాయి. అలాగే, వీటి మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడం, సాంకేతిక నిబంధనలను రెగ్యులేట్ చేయడం, కస్టమ్స్ విధానాలను డిజిటలైజ్ చేయడం వంటి చర్యలతో కూడిన అంతర్గత-ప్రాంతీయ వాణిజ్యం అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను రూపొందించడం కూడా ఈ చర్చల్లో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Tags: Prime Ministers of India and Pakistan will meet soon
