వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకగా స్వర్ణరథోత్సవం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని 200 మంది టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, సిఇ నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దేవి, వెల్ఫేర్ డిప్యూటీ ఈఓ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.కాగా, వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ఏడున్నర గంటలకు సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Swarnarathotsavam is celebrated on the occasion of Vaikuntha Ekadashi