అదుపు తప్పిన కారు..ఇద్దరు యువకుల మృతి

చిత్తూరు ముచ్చట్లు:


చిత్తూరు జిల్లా  శాంతిపురం మండలం కడపల్లి వద్ద కారు అదుపుతప్పి గోడను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన యువకులు కుప్పానికి చెందిన ప్రముఖ లాయర్ నటరాజ్ కుమారుడు ఈశ్వర్ ఆధిత్య, భరత్ గా గుర్తించారు. త్యాగరాజు అనే యువకుడికి గాయాలు అయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: The car went out of control..Two youths died

Leave A Reply

Your email address will not be published.